ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శాకంబరీ మహోత్సవాలు..!
Publish Date:Jul 26, 2026
Advertisement
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు జూలై 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. ఈ మేరకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తెలిపారు. ప్రకృతి స్వరూపిణిగా భావించే అమ్మవారిని వివిధ రకాల కూరగా యలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించడం శాకంబరీ ఉత్సవాల విశిష్టత. భూమిపై సకా లంలో వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. 2007లో అప్పటి దేవస్థానం ఈవో ఎస్.ఎస్. చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సంప్రదాయం ప్రస్తుతం 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో వరంగల్ భద్రకాళీ ఆలయంలో జరిగే శాకంబరీ పూజలను అధ్యయనం చేసిన అనంతరం ఇంద్రకీ లాద్రిపై ఈ ఉత్సవాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం కారణంగా మార్కెట్‌లో కూరగాయల లభ్యత తగ్గినప్పటికీ, దేవస్థానం ప్రత్యేక బృందా లను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల రైతులు, వ్యాపా రుల నుంచి విరాళాల రూపంలో కూరగాయలు, ఆకుకూరలను సేకరించింది. తొలి విడతగా ఇప్పటికే 32 టన్నుల కూరగాయలు, ఆకుకూ రలు ఆలయానికి చేరుకు న్నాయి. అదనంగా విజయవాడ కేదారేశ్వ రపేట హోల్‌సేల్ పండ్ల మార్కెట్ నుంచి మరో 4 టన్నుల పండ్లు విరాళంగా అందనున్నాయి. రైతులు ఎంతో శ్రమించి పండించిన కూరగాయలు, పండ్లు ఆలయం వెలుపల అలంకరణల వల్ల వృథా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఈవో తెలిపారు. ఇప్పటికే కాయగూరల దండలను సిద్ధం చేసి ఆలయ ప్రాంగ ణాన్ని శోభాయమానంగా అలంకరిస్తున్నట్లు పేర్కొ న్నారు. మూడు రోజుల ఉత్సవాల సందర్భంగా కూడా అమ్మవారి దర్శన సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, సాధారణ రోజుల మాదిరి గానే భక్తులకు దర్శనం కల్పిస్తామని ఈవో వి.కె. శీనా నాయక్ స్పష్టం చేశారు. ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), సభ్యులు, దేవస్థాన సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఈ పవిత్ర ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మ వారి ఆశీస్సులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Indrakeeladri, Shakambari Festival, EO V.K. Sheena Nayak, Kanakadurgamma Temple, Vijayawada
http://www.teluguone.com/news/content/indrakeeladri-36-227177.html





