ఇండోనేసియాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!

Publish Date:Aug 14, 2026

Advertisement

ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. శనివారం (ఆగస్టు 15) తెల్లవారుజామున భూమి కంపించింది.  సముద్ర గర్భంలో పది కిలో మీటర్ల లోతున సంభవించిన ఈ  భూకంపం ధాటికి అనేక ద్వీపాలు, తీరప్రాంత నగరాలు ఉలిక్కిపడ్డాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ   భూకంపం వల్ల సంభవించిన ప్రకంపనలకు ప్రజలు  భయాందోళనలకు గురైఇళ్ల నుంచి బయటకు  పరుగులు తీశారు. అమెరికా జియోలాజికల్ సర్వే  ప్రకారం, ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు  అయ్యింది. సముద్ర ఉపరితలం నుంచి కేవలం 10  కిలోమీటర్ల లోతులో ఈ  భూకంప కేంద్రం ఉంది. భూకంపం ఇంత తక్కువ లోతులో సంభవించడంతో ప్రకంపనల తీవ్రత భారీగా ఉంది.ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

 . భూకంప కేంద్రానికి   300 కిలోమీటర్ల పరిధిలోని తీరప్రాంత ప్రజలందరూ తక్షణం తమ ఇళ్లు ఖాళీ చేసి, ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగసిపడి తీరాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులుహెచ్చరించారు. కేవలం ఇండోనేషియా మాత్రమే కాకుండా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం  పొరుగు దేశాలైన ఫిలిప్పీన్స్, మలేషియా, ఆస్ట్రేలియాలను అప్రమత్తం చేస్తూ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది.

సమాచారం అందిన వెంటనే ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి, సహాయక చర్యలను వేగవంతం చేసింది. శోధన బృందాలను తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు దెబ్బన్నాయి.   

Indonesia Earthquake, 77 Magnitude Quake, Tsunami Warning Indonesia, USGS Earthquake Report, BMKG Indonesia, Pacific Ring of Fire

By
en-us Political News

  
టీటీడీకి నెయ్యి సరఫరా విషయంలో సజ్జల తమ సంస్థ సంగం డెయిరీపై   అసత్య ఆరోపణలు చేశారంటూ 10 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేసింది. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు న్యాయస్థానంలో సంగం డెయిరీ యాజమాన్యం ఈ మేరకు  పిటిషన్ దాఖలు చేసింది.
వైఎస్ వివేకా కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆయన నివాసాలు, కార్యాలయాలు, అలాగే ఆయన ముఖ్య అనుచరుల నివాసాలలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌,   కడప, పులివెందులలోని  ప్రాంతాల్లో దాదాపు 10 ప్రదేశాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలను చేపట్టాయి.
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో  దోషిగా  తీహార్ జైళ్లో  శిక్ష అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను జైలు అధికారులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.  
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లుఅలాగే  ఏపీ ఉన్నత విద్య నియంత్రణ,  పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లుకు కూడా శాసనమండలి  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే..  విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు సైతం సభ ఆమోదం పొందింది.
 దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన చంద్రబాబు నొక్కి చెప్పారు.  అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు  ప్రతిపాదించారు.
హర్మూజ్ జలసంధిలోని దక్షిణ మార్గంలో, ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా నియంత్రణలోని ఈ ప్రత్యేక కారిడార్‌..  సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి  ఇంధన ఉత్పత్తి దేశాల నుంచి చమురు నింపుకున్న ట్యాంకర్లతో పాటు, ఖాళీగా తిరిగొచ్చే నౌకలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ రవాణాను సమన్వయం చేస్తున్నది.
ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి,  రేచర్ల బొగ్గు బ్లాకులను ఎంపిక చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఈ రెండు  బొగ్గు బ్లాకులను దక్కించుకుంది.
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల  విదేశీ చెల్లింపుల  వ్యవహారంలో పన్ను ఎగవేత, యు అక్రమ నిధుల మళ్లింపు ఆరోపణలపై ఐటీ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో  13 ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.  ఈ సోదాల్లో డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి ఎల్‌ఐసికి ఆర్బీఐ అనుమతి లభించింది. ఈ వార్తతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర 1% పెరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. కొకైన్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ITIA అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ పూల్ డి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 5 3 తేడాతో సంచలన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగి జట్టుకు ఘన విజయాన్ని అందించిన పూర్తి వివరాలు చూడండి.
బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధు, ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. సాత్విక్ చిరాగ్ జోడీకి వాకోవర్ లభించగా, లక్ష్యసేన్ తీవ్ర పోరాటంలో ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ఫలితాలు, కీలక గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.