శ్రీమతి గాంధీ.. రాజకీయాలలో ఐరన్ లేడీ మాత్రమే కాదు.. నిలువెత్తు కృతజ్ణతా చిహ్నం కూడా!

Publish Date:Mar 22, 2026

Advertisement

ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం. అంతర్జాతీయ రాజకీయాలలో ఆమెది అందె వేసిన చెయ్యి. యుద్ధ సమయాలలో ఆమె వేసిన అడుగులు విప్లవాత్మకం. ఇక పేదల పాలిట ఆమె పెన్నిది. జనం ఆప్యాయంగా ఆమెను ఇందిరమ్మా అని పిలుచుకున్నారు. గరీబీహఠావో అంటూ దేశంలో పేదరిక నిర్మూలనకు నడుంబిగించారు.

 ఇందిరాగాంధీ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. యావత్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారెవ్వరూ ఉండరు.   దేశ చరిత్రలో   ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ.

 గరీబీహఠావో అంటూ దేశంలో పేదరిక నిర్మూలనకు నడుంబిగించారు. బ్యాంకింగ్ రంగాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా వాటిని జాతీయం చేశారు.  బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి విజయం సాధించారు. ఆ సందర్భంగా ఆమెను ప్రత్యర్థులు సైతం ప్రశంసలతో ముంచెత్తారు. వాజ్ పేయి అయితే ఇందిరాగాంధీని కాళికాదేవితో పోల్చి పొగడ్తల్లో ముంచెత్తారు.  అలాగే రాజభరణాలను రద్దు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించి భారత్ అణుశక్తి దేశంగా అవతరించడానికి దోహదపడ్డారు. అలాగే ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని సమూలంగా అణచివేయడానికి ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించారు.  
అయితే ఎంతటి మనిషికైనా జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. దేశంలో ఎమెర్జెన్సీ తరువాత 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ తరువాత ఆమె రాజకీయంగానే కాకుండా, ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో పడ్డారు. ప్రత్యర్థుల ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఆమె బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కనీసం కోర్టు ఖర్చులకు కూడా చేతిలో డబ్బులోని పరిస్థితిని ఇందిరాగాంధీ ఎదుర్కొన్నారు.  దేశంలోనే తిరుగులేని నాయకురాలిగా ఇండియాయే ఇందిర, ఇందిరే ఇండియా అని మన్ననలు అందుకున్న ఇందిరాగాంధీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో పడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థిని ఎదుర్కొన్నారు. 

ఆ సమయంలో  ఏదో పని మీద ఇందిరాగాంధీ గారిని  కలవడానికి వచ్చిన పి.వి.నరసింహారావురావును.. “మిస్టర్ పీవీ నాకు కొంచెం డబ్బు అవసరం, సర్దగలరా? అని అడిగారు. దానికి పీవీ ఎంత మేడం అని అడిగితే.. ఇందిరాగాంధీ ఒక వేలు చూపించారట.. దానికి  పీవీ లక్షా అంత నా వద్ద లేదు ఓ ముప్ఫై వేలు ఉన్నాయి అన్నారట. అందుకు ఇందిరాగాంధీ పేలవంగా ఓ నవ్వు నవ్వి వేలూ లక్షలూ కాదు పీవీ కోటి రూపాయలు కావాలి అనడంతో.. పీవీ ప్రయత్నిస్తాను అని చెప్పి బయటకు వచ్చారట. ఆ తరువాత అప్పటి హిందూపురం ఎంపీ సోమశేఖర్ కు విషయం చెప్పి సర్దగలవా అని అడిగితే.. ఆయన తన వల్ల కాదు అని  ఎల్జీ బాలకృష్ణ పేరు సూచించారట. ఎల్జీ బాలకృష్ణ కోయంబత్తూరు కేందరంగా వ్యాపారాలు సాగించేవారు. ఆయనకు హిందూపురంలోనూ రెండు స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి.  

సోమ శేఖర్   బాలకృష్ణను కలిసి విషయం చెప్పగానే..  క్షణం ఆలోచించకుండా అంత గొప్ప నాయకురాలు అడిగితే కాదనడం ఏమిటి అంటూ వెంటనే రెండు ట్రంకు పెట్టేల్లో కోటి రూపాయలు నింపి ఇచ్చి పంపించారట. అప్పట్లో వందరూపాయల నోటే పెద్దది. అటువంటి వందరూపాయల నోట్లను కట్టలు కట్టి రెండు ట్రంక్ పెట్టెల్లో నింపి ఇద్దరు మనుషులను తోడిచ్చి మరీ ట్రైన్ ఎక్కించారట. ఆ సొమ్ము అలా పీవీ నరసింహరావు ద్వారా ఇందిరాగాంధీకి చేరింది. ఎవరిచ్చారు అని అడిగితే పీవీ ఎల్జీబాలకృష్ణ పేరు చెప్పారు. ఇందిరాగాంధీ ఆ పేరు నోట్ చేసుకున్నారట. సాధారణంగా అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ అంతటి గొప్ప వ్యక్తి అడిగితే ఇవ్వడం, ఆ తరువాత ఆ విషయం మరుగున పడిపోవడం జరుగుతుందిప. కానీ ఇందిరాగాంధీ వ్యక్తిత్వం అలాంటిది కాదు.  
  1980 ఎన్నికలలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. ఆమె ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారానికి తనను కష్టకాలంలో ఆదుకున్న బాలకృష్ణను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తన కారులో  ప్రమాణ స్వీకార వేదిక వద్దకు తీసుకువెళ్లారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో   ఎల్జీ బాలకృష్ణకుప్రత్యేక ఆసనం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత తన ఇంటికి తీసుకువెళ్లి ఆయనతో కలిసి భోజనం చేశారు.  ఇవేవి  మొక్కుబడికి చేసిన మర్యాదలు కావు.  దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి,  మనస్ఫూర్తిగా  చేసిన మర్యాదలు. మూడేళ్ల కిందట ఎల్జీ బాలకృష్ణ తనకు కష్ట కాలంలో చేసిన సాయాన్ని మరిచిపోకుండా ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు ఇందిరాగాంధీ. ప్రధాని హోదాలో ఉన్న ఇందిరా గాంధీ  ఆయనకు హాయ్  చెప్పి, షేక్ హ్యాండిచ్చి ఊరుకోవచ్చు.  కాదనేవారు ఎవరు? లేదా, వేరొకరికి  అప్పచెప్పి, ప్రమాణ స్వీకారంలో  ముందు వరుసలో సీటు కేటాయించి, ఓ ఫోటో దిగి వెళ్లిపోవచ్చు. అదే గొప్ప.

 కాని.. ఇందిరాగాంధీ అలా చేయలేదు.   గతం గుర్తుంచుకొని  స్వయంగా ఆహ్వానించి, తమతోనే తీసు కెళ్ళి ఇంట్లో కలిసి భోం చేయడం, ఆమె ఔన్నత్యానికి ప్రతీక. చేసిన మేలును మరువని హృదయపూర్వక కృతజ్ఞత. అది ఒక గొప్ప జ్ఞాపిక.  ఉదయం సాయం చేసిన వారిని సాయంకాలానికే  మర్చిపోతున్న ఈ రోజుల్లో పొందిన ఉపకారాన్ని గుర్తుంచుకొని సరైన గుర్తింపు ఇచ్చే వారే నిజమైన నాయకులని నిరూపించిన వాస్తవ ఘటన. ఇందిర వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్నీ నేటి తరం  నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలుగువన్ ఆకాంక్షిస్తోంది.

By
en-us Political News

  
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.