భువనేశ్వర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం వైజాగ్‌కు మళ్లింపు.. ఎందుకంటే?
Publish Date:May 28, 2026
Advertisement
శంషాబాద్ నుంచి భువ నేశ్వర్‌కు బయలుదేరిన ఇండిగో విమానాన్ని భువనేశ్వర్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విశాఖపట్నంకు మళ్లించారు. భువనేశ్వర్‌లో విమానం ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. అనంతరం అక్కడ కొంతసేపు నిలిపిన విమానాన్ని అర్ధరాత్రి తిరిగి శంషాబాద్‌కు తీసుకువ చ్చినట్లు సమాచారం. ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. తమ గమ్యస్థా నానికి చేరుకోకుండానే తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విమాన సంస్థ నుంచి సరైన సమాచారం అందలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/indigo-flight-diverted-to-vijag-36-221123.html
http://www.teluguone.com/news/content/indigo-flight-diverted-to-vijag-36-221123.html
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026





