ప్రపంచ పోలీస్ ప్యాంటు తడిపేసుకున్నాడు... చైనా చిన్నాన్న విషం చిమ్మాడు
Publish Date:Apr 11, 2020
Advertisement
అవును ఇది నిజం... అమెరికా నేడు ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశం కాదు. అలాగే, ప్రపంచ సంక్షేమం గురించి చైనా ఎప్పుడూ ఆలోచించదు. యూరోపియన్లు ప్రపంచంలో అంతా అనుకునేంత విద్యావంతులు కారు. యూరప్ లేదా అమెరికా వెళ్ళకుండా కూడా ప్రపంచంలోని ప్రజలు తమ సెలవులను ఎంతో ఆనందంగా గడపగలరు. భారతీయుల రోగ నిరోధక శక్తి ప్రపంచంలో చాలా దేశాల ప్రజల కంటే ఎంతో శక్తివంతమైనది. ఏ స్వామీజీ, పీఠాధిపతి, మతాధికారి, సిద్ధాంతి, జ్యోతిష్కుడు, పూజారి, రచయిత లాంటి వాళ్ళెవరూ ఒక్క రోగిని కూడా రక్షించలేరని తేలిపోయింది. ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది మాత్రమే నిజమైన హీరోలు... క్రికెటర్లు, సినీ తారలు మరియు ఫుట్‌బాల్ ఆటగాళ్ళు కేవలం సాధారణ వ్యక్తులు. ప్రపంచంలో వినియోగం లేకపోతే బంగారం, వజ్రాలకు కూడా ప్రాముఖ్యత తగ్గిపోతుందని తెలిసింది. ఈ ప్రపంచంలో తమకు కూడా మనుషుల్లాగానే బ్రతికే హక్కు ఉందని జంతువులు మరియు పక్షులు మొదటిసారి సంతోషించాయి. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు తమ పనిని ఇంటి నుండే చేయవచ్చని నిరూపించారు. మనం, మన పిల్లలు 'జంక్ ఫుడ్' లేకుండా జీవించగలం అనే నమ్మకం కలిగింది.పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం ఏ మాత్రం కష్టమైన పని కాదు అనేది అందరికీ బుర్రకెక్కింది. అన్నం, కూర వండటం మహిళలు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుంటుందన్న భావన అందరికీ కలిగింది. మీడియా ప్రజల్ని తప్పుదోవ పట్టించే చెత్తా చెదారం ప్రసారం చేయకుండా, పనికొచ్చే విషయాలను కూడా ప్రసారం చేయగలదని ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. భారతీయ మహిళల కారణంగా ఇంటిని ఆలయంగా ఎలా ఉంచుకోవాలో పరాయి దేశం నేర్చుకునేటట్టు చేసింది. డబ్బుకు విలువ లేదు, ఎందుకంటే ఈరోజు మీరు పులుసుతో అన్నం తిని కూడా బతకొచ్చు అనేది తెలుసుకున్నారు. భారతీయులు కుల, మత, ధనిక, పేద భేదాలతో ఎక్కువగా కీచులాడుకుంటారన్న ఇతర దేశాల అపోహ పటాపంచలు అయ్యింది. భారతీయుడు మాత్రమే క్లిష్టమైన సమయాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలడని ప్రపంచ దేశాలతో ఎలుగెత్తి చాటబడింది.
http://www.teluguone.com/news/content/indians-have-stronger-immunity-power-39-97409.html





