ఒలింపిక్స్ కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు!
Publish Date:Aug 8, 2024
Advertisement
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియా హాకీ టీమ్ అదరగొట్టింది. కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్స్లో జర్మనీ చేతిలో ఓడిపోయిన నిరాశ నుంచి తేరుకుని, దేశ ప్రజలను సంతోషంలో ముంచెత్తుతూ భారత హాకీ జట్టు సభ్యులు కాంస్యం సాధించారు. గురువారం రాత్రి చాలా ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్లో భారత జట్టు స్పెయిన్ మీద 2-1 తేడాతో విజయం సాధించింది. ఇండియా తరఫున హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ కొట్టగా, స్పెయిన్ తరఫున ఒకే ఒక గోల్ని మిరాల్స్ మార్క్ సాధించాడు. 41 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణకు తెరవేస్తూ భారత హాకీ జట్టు గత టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించింది. 1968, 1972లో కాంస్య పతకాలు సాధించిన తర్వాత ఒలింపిక్స్ హాకీలో వరుసగా భారత్ రెండు కాంస్య పతకాలు సాధించడం (2021, 2024) ఇదే తొలిసారి. వీరోచితంగా పోరాడి కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు.
http://www.teluguone.com/news/content/indian-hockey-team-wins-a-bronze-at-paris-olympics-2024-in-a-tough-game-against-spain-25-182570.html





