Publish Date:Jan 26, 2022
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్. పూర్తిగా ముస్లిం ఆధిపత్యం ఉన్న ప్రాంతం. వాళ్లలో అధిక సంఖ్యాకులు పాక్ అభిమానులే. మన దేశంలో ఉంటూ జై పాకిస్తాన్ అంటూ నినదించే బ్యాచ్. అలాంటి శ్రీనగర్‌లో లాల్‌చౌక్ మరింత డేంజరస్. దేశ వ్యతిరేక నిరసనలు, ధర్నాలకు సెంటర్ పాయింట్. అందుకే, అక్కడి ప్రఖ్యాత ఘంటా ఘర్ (క్లాక్ టవర్)పై ఎప్పుడూ పాకిస్తాన్ జెండానే ఎగురుతూ ఉండేది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ అక్కడ పాక్ అనుకూల డామినేషనే. త్రివర్ణపతాకం ఎగిరిందేలే.
అలాంటిది.. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా లాల్‌చౌక్‌లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. అక్కడి క్లాక్ టవర్‌పై భారతీయ మువ్వన్నెల జెండా రెపరెలాడింది. 73వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పలువురు స్థానికులు ఈ జెండాను ఎగురవేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లాల్‌చౌక్ ఘాంటా ఘర్‌పై జాతీయపతాకం ఎగురవేయడం ఇదే మొదటిసారి అంటే నమ్మాల్సిందే.
లాల్‌చౌక్ ప్రాంతంలో ఎన్‌జీవోలు, ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్థానికులు 73వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఇద్దరు స్థానిక యువకులు సాజిద్ యూసుఫ్ షా, సహిల్ బషీర్‌లు ఒక క్రేన్ సాయంతో క్లాక్ టవర్ పైవరకూ వెళ్లి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ''స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ పాకిస్థాన్ జెండాలు మత్రమే ఎగిరేవి. శాంతికి భంగం కలిగిస్తూ వచ్చిన పాకిస్థాన్ ప్రేరేపిత వ్యక్తులు ఈ జెండాలు ఎగుర వేసేవారు. 370వ అధికరణ రద్దు తర్వాత ఇక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. నయా కశ్మీర్ అంటే ఏమిటని జనం అడుగుతున్నారు? ఇవాళ ఎగురవేసిన త్రివర్ణ పతాకమే నయా కశ్మీర్‌కు అర్ధం చెబుతుంది. ఇదే జమ్మూకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నది కూడా. మాకు పాకిస్థాన్ జెండాలు అక్కర్లేదు. మేము శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నాం'' అని జెండా ఆవిష్కరణ అనంతరం స్థానికుడు ఒకరు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/indian-flag-hoisting-at-srinagar-lal-chowk-clock-tower-39-130772.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.