ఇండియన్ ఆర్మీ మాస్టర్ ప్లాన్.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్!

Publish Date:May 5, 2025

Advertisement

విలేజ్ డిఫెన్స్ గార్డ్స్. వినడానికి కొత్తగా ఉన్నా.. విషయం చాలా ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. సరిహద్దు జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయనే అనుమానాలున్నాయి.  దాంతో.. ఇండియన్ ఆర్మీ ఓ కొత్త ప్లాన్ వేసింది. భారత సరిహద్దుల అవతలి నుంచి వచ్చే ఎలాంటి శత్రువైనా సరే.. ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా మన ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. 

భారత శత్రువులెవరైనా సరే.. మన బోర్డర్ దాటాలంటే ఇకపై ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మన సరిహద్దుల అవతలి నుంచి వచ్చే ఏ శత్రువైనా సరే.. ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా ఇండియన్ ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇందుకోసం.. భారత బలగాలు సరికొత్త ప్లాన్ వేశాయ్. తీవ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు.. బోర్డర్ దగ్గర్లో ఉన్న గ్రామస్తులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ తుపాకులు అందిస్తోంది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.  దాంతో.. జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్, దోడా, రాజౌరి, పూంచ్ లాంటి జిల్లాల్లో.. భద్రత దృష్ట్యా.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులతో.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్.. తమ ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు.. ఈ ట్రైనింగ్ ఎంతో కీలకమని పోలీసు అధికారులు చెబుతున్నారు. కొన్ని వారాలుగా.. కిష్ట్వార్, దోడా, ఉధమ్‌పూర్ జిల్లాల్లో టెర్రరిస్టుల యాక్టివిటీ పెరిగింది. గత నెలలో కిష్ట్వార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు, ఇంకొందరు టెర్రరిస్టులు తప్పించుకొని.. దట్టమైన అడవుల్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. దాంతో.. ఈ శిక్షణా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌ని.. సరిహద్దులకు దగ్గర్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కాపాడేందుకు, ఉగ్రవాదుల నుంచి స్థానికులను రక్షించేందుకు ఏర్పాటు చేశారు. వీరికి.. పోలీసులు, సైన్యమే.. ఆయుధాలతో పాటు శిక్షణ కూడా ఇస్తాయి. ఈ ఆపరేషన్లలో.. ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో ఉగ్రవాదుల కదలికలను గమనిస్తున్నారు.

విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కి ప్రధానంగా రైఫిళ్లు, ఆటోమేటిక్ ఆయుధాలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే విధానంపై శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాద దాడుల సమయంలో.. రక్షణాత్మకంగా ఉండటంతో పాటు, వారిపై ఏ విధంగా దాడి చేయాలనే దానికి సంబంధించిన వ్యూహాలను అమలు చేసే పద్ధతుల్ని కూడా నేర్పిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఆకస్మిక దాడుల సమయంలో వెంటనే స్పందించడం, అందరితో సమన్వయం చేసుకోవడం ఎలా అనేది కూడా చెబుతున్నారు. బోర్డర్‌ దగ్గరలో అనుమానాస్పద కదలికలను గుర్తించి.. పోలీసులకు, సైన్యానికి సమాచారం అందించడంపైనా శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా.. గ్రామీణ, కొండ ప్రాంతాల్లో శారీరకంగా చురుగ్గా ఉండేందుకు ఫిట్‌నెట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సెషన్ అంతా.. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాల్లో సాగుతున్నాయి. కొన్నిసార్లు.. డ్రోన్ టెక్నాలజీ, రాత్రి పూట గస్తీ లాంటి ఆధునిక టెక్నిక్‌లపైనా శిక్షణ ఇస్తున్నారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కలిసి.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కి ట్రైనింగ్ సెషన్స్‌ని నిర్వహిస్తున్నాయి.

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలు మరింత కఠినతరమయ్యాయ్. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు.. ఈ గ్రామ రక్షణ బృందాలను సన్నద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ విలేజ్ డిఫెన్స్ గార్డులకు శిక్షణని తప్పనిసరి చేయడం ద్వారా.. సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కొనేందుకు.. ప్రభుత్వం, సైన్యం, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు.. సరిహద్దు గ్రామాల్లో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నారు.

మరోవైపు.. జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేందుకు యాక్షన్ ప్లాన్‌ని వేగవంతం చేశాయి. కిష్ట్వార్‌లోని దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌తో పాటు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనుమానాస్పద కదలికలను గమనిస్తే.. వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో సహాయపడతాయని అధికారులు చెబుతున్నారు.

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.