పాకిస్థాన్‌తో యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీ ని రంగంలోకి దించాలని నిర్ణయించింది. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి మరిన్ని అధికారులను అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని సూచించింది. ప్రత్యర్థులతో తలపడేందుకు భారత్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు ఈ టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది.
రెగ్యులర్ ఆర్మీలో ఇది భాగమే అయినప్పటికీ అవసరమైన సందర్భంలోనే ఈ టెరిటోరియల్ ఆర్మీ రంగంలోకి దిగుతుంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. 1962, 1965, 1971 యుద్ధాల్లోనూ భారత సైన్యంతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేసింది. రెగ్యులర్ ఆర్మీకి సెకండరీ ఫోర్స్‌గా ఉండే టెరిటోరియల్ ఆర్మీలోని సిబ్బందికి నేషనల్ ఎమర్జెన్జీ, అంతర్గత భద్రత విధులకు సంబంధించి శిక్షణ ఇస్తుంటారు. ప్రస్తుతం 32 టెరిటోరియల్ ఆర్మీ ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ ఉన్నాయి.టెరిటోరియల్ ఆర్మీ అధికారులు సిబ్బందిని పిలిచే అధికారాన్ని ఆర్మీ చీఫ్‌కు కల్పించింది. రెగ్యూలర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉండాలని సూచించింది.
టెరిటోరియల్ ఆర్మీని క్లుప్తంగా 'సైనిక రిజర్వ్ దళం' అని చెప్పవచ్చు. దేశానికి క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు, సాధారణ సైన్యానికి మద్దతుగా నిలిచేందుకు ఈ దళాలు సిద్ధంగా ఉంటాయి. వీరికి కూడా రెగ్యులర్ సైనికులతో సమానంగా కఠినమైన శిక్షణ ఇస్తారు. అయితే, వీరు నిరంతరం సైన్యంతో ఉండరు. తమతమ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూనే, స్వచ్ఛందంగా దేశసేవలో పాలుపంచుకుంటారు. 1948లో భారత టెరిటోరియల్ ఆర్మీ చట్టాన్ని ఆమోదించగా, 1949లో ఇది అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ దళంలో సుమారు 50 వేల మంది క్రియాశీలకంగా ఉన్నట్లు అంచనా.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/indian-army-39-197770.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.