వర్షం తో  ఉత్కంఠభరితంగా మారిన మ్యాచ్ లో భారత్ విజయం

Publish Date:Nov 2, 2022

Advertisement

చివరి ఓవర్ వరకూ ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్  చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్నంతగా సాగింది. చివరి రెండు ఓవర్లలో బంగ్లాను పరుగులు పెద్దగా చేయకుండా భారత్ బౌలర్లు నిలువరించడంతో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుధవారం మాత్రం మంచి పట్టుగా సాగుతున్న మ్యాచ్ కి వర్షం పెద్ద గండంగా మారింది. బుధవారం మొదటి మ్యాచ్ సమయానికి వర్షం లేకపోవడంతో ఈ రెండో మ్యాచ్ ఎలాంటి అవాంతరం లేకుండా సాగుతుందనే అనుకున్నారు. కానీ  బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం తో కొంత సమయం ఆట నిలిపివేయవలసి వచ్చింది. భారత్ తమ ఇన్నింగ్స్  లో కోహ్లీ, సూర్యకుమార్ ధనాధన్ బ్యాటింగ్ తో 20 ఓవర్లలో 184 పరుగులు చేసి బంగ్లాకు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టారు. కానీ వర్షం పడిన కారణంగా బంగ్లాదేశ్ లక్స్యం 16 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యం విధించారు.  

కానీ  ఊహించిన దానికంటే బంగ్లా ఓపెనర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా లింటన్ దాస్ భారత్ పేసర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అతను కేవలం 21 బంతుల్లోనే అర్ధసెంచరీ చేయడంలో అతని బ్యాటింగ్ సత్తాను రుజువుచేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిన సమయానికి బంగ్లాదేశ్ డి ఎల్ ఎస్ విధానానికి మౌలిక రన్ రేట్ కి 17 పరుగులు ముందంజలో నిలిచింది.  మ్యాచ్ మళ్లీ ఆరంభమయ్యే సమయానికి బంగ్లా 9 ఓవర్లలో 85 పరుగులు చేయలసి వచ్చింది. అంటే రన్ రేట్ 9.44 ఉంది. 8 ఓవర్లో అశ్విన్ బంతిని మిడ్ వికెట్ లోకి అవతలి బ్యాటర్ శాంతన్ ఫోర్ కోసం షాట్ కొట్టాడు. కానీ అక్కడ రాహుల్ బంతిని అందుకుని చక్కటి త్రో చేశాడు. అది నేరుగా స్టంప్ కి తగలడంతో పరుగు కోసం బోర్లా పడిన లిటన్ దాస్ వెనుదిరగాల్సి వచ్చింది. అలా లిట్టన్ దూకుడికి కళ్లెం పడింది.  లిట్టన్ దాస్ 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 60 పరుగులు చేశాడు. తొలి ఓవర్లలో సరిగా ఆకట్టుకోలేకపోయిన అర్ష్ దీప్ 12 వ ఓవర్లో అద్భుతంగా చేసి కేవలం 2 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అందులో అప్పటికే మంచి ఫామ్ లో ఉండి స్కోర్ చేయగల సత్తా ఉన్న షకీబుల్ ను పెవిలియన్ దారి పట్టించడం ఎంతో హర్షణీయం. అప్పటికి అతను 2 ఓవర్లలో 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీసినట్టయింది. 

కింగ్ కోహ్లీ మళ్లీ మెరుపులు మెరిపించాడు. బుధవారం గ్రూప్ 2 లో బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ 12 విభాగం నాలుగో మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ కి  కోహ్లీ దారులు వేశాడు.  టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారత్ కు ముందుగా బ్యాట్ చేసే అవకాశం ఇచ్చాడు.  భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.  భారత్ తొలి దశలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ నుంచి ఈమ్యాచ్ లో మంచి స్కోర్ అభిమానులు ఎంతో ఆశించారు. రోహిత్ 2 పరుగులకే ఔట్‌గా వెనుదిరిగాడు. హసన్ మహ్ముద్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి యాసిర్ అలీకి రోహిత్ క్యాచ్‌గా చిక్కడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరూ నిలదొక్కుకుని మిడిలార్డర్‌పై భారం పడకుండా చూడాల్సిన మ్యాచ్‌లో రోహిత్ పేలవ ఆట తీరుతో టీమిండియా అభిమానులను నిరాశపరిచాడు. రోహిత్ పెవిలియన్ చేరగానే రంగంలోకి దిగిన కోహ్లీ  అప్పటికే నిలకడగా ఆడుతున్న కె.ఎల్.రాహు ల్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టడంతో పాటు స్కోర్ ను పరుగులెత్తించాడు.  వైస్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాణించాడు. 32 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.  కానీ వెంటనే వెనుదిరిగాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించాడు. 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ దూకుడుగా ఆడుతున్న సూర్యను షకీబ్ అల్ హసన్ ఔట్ చేశాడు. అప్పటి వరకూ కోహ్లీ తో కలిసిన యాదవ్ ధాటికి బంగ్లా బౌలర్లు దాసోహం పలికారనే అనాలి. కింగ్ 44 బంతుల్లో 64 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు.  అడెలైడ్ లో మ్యాచ్ కి వరుణుడి గండం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించినప్పటికీ వరుణుడి కంటే బంగ్లాను కోహ్లీయే భయపెట్టాడు. అతని ధాటికి బౌలర్లు బెంబేలెత్తారు. ఆసీస్ లో మొన్నటి హోటల్ సంఘటన అతని మీద ఎలాంటి ప్రభావం చూపలేదనే అనాలి. ఆట, జట్టును గెలిపించడం మాత్రమే ప్రధానంగా తీసుకోవడాన్ని తన పరుగులవరదతో తెలియ జేశాడు.  

ఈ మ్యాచ్ కి రెండు జట్లలోనూ మార్పులు చేర్పులు జరిగాయి. దీపక్ హుడా స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కి అవకాశం కల్పించారు. అయితే ఈ మ్యాచ్ లోనయినా అవకాశం ఇస్తారనుకున్న కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ని మాత్రం మళ్లీ బెంచ్ కే పరిమితం చేశారు. వెన్ను నొప్పితో ఇబ్బందిపడుతున్న కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కోలుకున్నాడని, అతని అవసరం గుర్తించి పంత్ కు సారీ చెప్పారు. ఈ పర్యాయం ప్రపంచకప్ పోటీల్లో వరుసగా నాలుగో మ్యాచ్ లో పంత్ బెంచ్ కే పరిమితం చేయడం పంత్ వీరాభిమానులు ఎంతో నిరాశచెందారు.  కోహ్లీ రాహుల్ కలిసి 25 బంతుల్లో 38 పరుగులు, ఆ తర్వాత కోహ్లీ కార్తిక్ 12 బంతుల్లో 20 పరుగులు, చివర్లో కోహ్లీ అశ్విన్లు 11 బంతుల్లో 27 పరుగులు చేశారు. అదే బంగ్లా ఇన్నింగ్స్ లో లిట్టన్ దాస్, హసన్ లు మొదటి వికెట్ కి 44 బంతుల్లో 66 పరుగులు చేశారు. 

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.