Publish Date:May 16, 2025
నమ్మక ద్రోహానికీ, విశ్వాస ఘాతుకానికీ పాల్పడిన టర్కీకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆ దేశ సంస్థ సెలిబి ఏవియేషన్ కు భద్రత అనుమతిని రద్దు చేసింది. ఆపరేషన్ సిందూర్, తదననంతర పరిణామాలలో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టర్కీ పాకిస్థాన్ కు పూర్తి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో భారీ భూకంపంలో టర్కీ దయనీయ స్థితిలో ఉన్న సమయంలో భారత్ దోస్త్ అంటూ ఆ దేశానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. అపత్సమయంలో ఆపన్న హస్తం అందించిన భారత్ విషయంలో టర్కీ వ్యవహరించిన తీరుకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇండియాలో అయితే టర్కీ ఉత్పత్తులు, కంపెనీలను బ్యాన్ చేయాలన్న డిమాండ్ జోరుగా వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా పాలు పోసిన చేతినే పాములా కాటేసిన టర్కీకి ఇండియా గట్టి గుణపాఠం చెప్పింది. టర్కీ సంస్థ సెలెబి ఏవియేషన్‌కు భద్రతా అనుమతిని భారత్ రద్దు చేసింది. టర్కీకి చెందిన సెలిబి ఏవియేషన్ సంస్థ భారత్ లోని తొమ్మిది విమానాశ్రయాలలో హై సెక్యూరిటీ పనులను నిర్వహిస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన భద్రతా అనుమతిని భారత ప్రభుత్వం రద్దు చేసింది.
ఉగ్రవాదానికి దన్నుగా నిలిచిన పాకిస్థాన్ కు టర్కీ మద్దతు ఇవ్వడాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ ఈ చర్య తీసుకుంది. అంతే కాదు ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలను తెంచుకోబోతోందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. తొట్టతొలిగా జాతీయ భద్రత దృష్ట్యా టర్కీ సంస్థ సెలిబీ ఏవియేషన్ భద్రతా అనుమతిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 1958లో స్థాపించబడిన సెలెబి కంపెనీ... టర్కీలో మొట్టమొదటి ప్రైవేట్ యాజమాన్యంలోని గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 70 విమానాశ్రయాలలో తన సేవలను అందిస్తున్నది. భారత్ పాకిస్థాన్ మథ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో టర్కీ పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా బాయ్‌కాట్ టర్కీ అన్న నినాదం జోరందుకుంది. ఈ తరుణంలో ఆ దేశానికి చెందిన సెలిబి యేవియేషన్ సంస్థ భద్రతా అనుమతిని కేంద్రం రద్దు చేయడం అంటే ముందు ముందు ఆ దేశంతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంబంధాలనూ రద్దు చేసేకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నదనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-shock-to-turkey-25-198155.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.