పెద్దన్నకు ఝలక్.. ట్రంప్ మధ్యవర్తిత్తం అక్కర్లేదని తేల్చి చెప్పిన ఇండియా!

Publish Date:May 10, 2025

Advertisement

నేను చేసేదేముంది? అది మీ గొడవ మీరే తేల్చుకోండి అంటూ చెబుతూ వస్తున్న అమెరికా ఇప్పుడు.. పాక్  భారత్ లక్ష్యంగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం అణిచివేతకు కఠిన నిర్ణయం తీసుకుంటున్న వేళ.. తగుదునమ్మా అంటూ మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పెద్ద మనిషిని నేనున్నాను కదా? మధ్యవర్తిత్వం చేస్తాను.. నా మాట వినండి అంటూ భారత్ కు ప్రతిపాదన పంపారు. అయితే అందుకు భారత్ నిర్ద్వంద్వంగా నో చెప్పింది. అగ్రదేశాధినేతను అన్న దర్పాన్ని ప్రదర్శించిన ఆయనకు భారత్ తన సమాధానంతో దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. మోడీ నాకు మంచి మిత్రుడు అంటూ పదేపదే చెప్పే ట్రంప్ కు అదే మోడీ స్నేహం స్నేహమే.. కానీ అంతర్గత విషయాల్లో జోక్యాన్ని భారత్ ఇసుమంతైనా అంగీకరించదని కుండబద్దలు కొట్టేశారు. అసలింతకీ ఏం జరిగిందంటే..

ఇండియా, పాకిస్థాన్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఇక తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. దాదాపు 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసేసింది. ఈ క్రమంలో వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. అలా హతమైన ఉగ్రవాదులలో పాక్ తన ఇంటల్లుడికి చేసినట్లు రాచమర్యాదలు చేస్తూ అన్ని విధాలుగా రక్షణగా నిలుస్తున్న ఉగ్రవాది మసూద్ అజహర్ సోదరుడు రవూఫ్, బంధువులు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో నిషేధత ఉగ్ర సంస్థ జై షే అహ్మద్ దాదాపు నామరూపాల్లేకుండా పోయింది.  దీంతో పాకిస్థాన్ భారత్ లక్ష్యంగా దాడులకు దిగింది. ప్రతిగా ఇండియా ఎదురుదాడులు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్యా యుద్ధవాతావరణం నెలకొంది. ఇంకా చెప్పాలంటే అప్రకటిత యుద్ధం  జరుగుతోంది.  

సరిగ్గా ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దరికం అంటూ రంగ ప్రవేశం చేశారు.  ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకు వచ్చారు.    ఉగ్రవాదంపై పోరుకు నాయకత్వం వహిస్తానంటూ చెప్పుకునే అగ్రరాజ్యం.. ఇంత కాలం భారత్ లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులపై ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడని ట్రంప్.. ఇప్పుడు పాక్ అన్ని విధాలుగా నష్టపోయి.. చేతులెత్తేస్తున్న వేళ.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారత్ ఉగ్రవాదంపై తుది పోరు సాగిస్తున్న సమయంలో దాడులు ఆపండి.. మధ్యవర్తిత్వం చేస్తానంటూ ముందుకు వచ్చారు. ఇందుకు భారత్ నిర్ద్వంద్వంగా నో చెప్పేసింది. మీ పెద్దరికం మీ వద్దే ఉంచుకోండంటూ సున్నితంగా కాదు.. ఒకింత నిష్కర్షగానే చెప్పింది. పాకిస్థాన్ తో తమ సమస్యలు పూర్తిగా ద్వైపాక్షికమని తేల్చేసింది. ఏది ఉన్నా పాకిస్థాన్ తోనే తేల్చుకుంటామని స్ఫష్టం చేసి ట్రంప్ నోరు మూయించింది. ఉగ్రవాదం మరియు సరిహద్దు సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలంటే ఫస్ట్ పాకిస్థాన్  ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపా లని అల్టిమేటమ్ ఇచ్చేసింది.  

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.