న్యూజిలాండ్ తో వన్డే సీరిస్ తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా చిత్తు
Publish Date:Nov 25, 2022
Advertisement
న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇండియా..నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల స్కోరు చేసింది. అయితే భారత్ నిర్దేశించిన 307 పరుగుల విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 17 బంతులు అంటే 2.5 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఛేదనలో న్యూజిలాండ్ కు గొప్ప ఆరంభమేమీ దక్కలేదు. 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కివీస్ స్కోరు బోర్డుపై 88 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి క్లిష్ట పరిస్థిల్లో ఉన్న సమయంలో స్కిప్పర్ కేన్ విలియమ్సన్, లాథమ్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దడమే మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు. ఒక విధంగా భారత్ చేసిన 306 పరుగులు భారీ స్కోరే. అయితే బౌలర్ల వైఫల్యంతో కొండ లాంటి లక్ష్యం కూడా న్యూజిలాండ్ ఉఫ్ మని ఊదేసింది. న్యూజిలాండ్ కెప్టెన్ 94 నాటౌట్ తో కలిసి లాథమ్ 145 నాటౌట్ న్యూజిలాండ్ కు సునాయాస విజయాన్ని అందించారు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ లుతొలి వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యం సాధించారు. స్కిప్పర్ శిఖర్ ధావన్ 72, ఓపెనర్ శుభమన్ గిల్ 50, శ్రేయస్స అయ్యర్స్ 80 అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 36 సిక్సర్లతో 37 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారీ స్కోరును ఢిఫెండ్ చేయడంతో టీమ్ ఇండియా బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఉమ్రాన్ 2 వికెట్లు పడగొట్టగా, వాషింగ్టన్ సుందర్ కు ఒక వికెట్ దక్కింది. వీరిద్దరితో సహా టీమ్ ఇండియా బౌలర్లందరూ ధారాళంగా పరుగులివ్వడంతో న్యూజిలాండ్ సునాయాసంగా విజయం సాధించింది. లాథమ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
http://www.teluguone.com/news/content/india-outplayed-by-kiwis-in-ist-one-day-won-by-7-wickets-25-147656.html





