జడేజా రికార్డ్ స్కోర్.. పంత్ సూపర్‌హిట్.. టీమిండియా బిగ్ ఇన్నింగ్స్..
Publish Date:Mar 5, 2022
Advertisement
జడేజా బాదేశాడు. రెచ్చిపోయి ఆడేశాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో కుమ్మేశాడు. అంతకుముందు రిషభ్ పంత్ టీ20 బ్యాటింగ్‌కు తలపించగా.. తానేమీ తక్కువ కాదన్నట్టు.. జడ్డూ సైతం చెలరేగిపోయాడు. శ్రీలంకతో తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (175 నాటౌట్; 228 బంతుల్లో 17×4,3×6) భారీ స్కోర్ చేశాడు. టీమిండియా తరఫున 7 నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా.. టెస్టుల్లో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు కపిల్ దేవ్ (163) పేరిట ఉన్న ఆ రికార్డును జడ్డూ బ్రేక్ చేశాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 574/8 స్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది. శనివారం రెండో రోజు ఆటలో భారత్ 357/6 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించగా మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకో 217 పరుగులు జోడించింది. తొలి సెషన్‌లో రవిచంద్రన్ అశ్విన్ (61; 82 బంతుల్లో 8×4)తో కలిసి ఏడో వికెట్‌కు 130 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించాడు జడేజా. సెకండ్ సెషన్‌లో మహమ్మద్ షమి (20; 34 బంతుల్లో 3x4) తో కలిసి 103 పరుగుల మరో సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు. దీంతో టీమిండియా 23 టెస్టుల తర్వాత 500కు పైగా స్కోర్ నమోదు చేసింది. ఇక, శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా రెండేసి వికెట్లు తీయగా.. లాహిరు కుమార, ధనంజయ డి సిల్వా చెరో వికెట్ పడగొట్టారు.
శుక్రవారం తొలిరోజు రిషభ్ పంత్ (96; 97 బంతుల్లో), హనుమ విహారి (58; 128 బంతుల్లో 5×4) హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. రిషభ్ పంత్ అయితే లంక బౌలర్లను ఊచకోత కోసేశాడు. తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సులతో చుక్కలు చూపించాడు. అయితే, సెంచరీకి 4 పరుగుల ముందు అవుటై పెలివియన్‌కు చేరుకున్నాడు.
http://www.teluguone.com/news/content/india-first-innings-score-25-132638.html





