కివీస్ పై ఇండియా చెత్త రికార్డు
Publish Date:Nov 25, 2022
Advertisement
న్యూజిలాండ్ పై ఓటముల్లో టీమ్ ఇండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో టీమ్ఇండియా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో న్యూజిలాండ్ పై వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన రికార్డును టీమ్ ఇండియా సాధించింది. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో మొదలైన ఓటముల పరంపర ఇప్పటి వరకూ కొనసాగింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ లో భారత్ 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై పరాజయం పాలైంది. ఆ తరువాత 2020లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ మరోసారి న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్ ఇండియా ఓటమినే మూటగట్టుకుంది. ఇప్పుడు శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్ తొలి వన్డేలో ఓడిపోయింది. దీంతో వన్డేల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి. చరిత్రలో ఇలా వరుసగా కివీస్ పై వన్డేల్లో భారత్ ఐదు మ్యాచుల్లో ఎన్నడూ ఓడిపోలేదు. చివరి సారిగా ఫిబ్రవరి 2019లో కివీస్ పై భారత్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో అంబటి రాయుడు 90 పరుగులు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
http://www.teluguone.com/news/content/india-fifth-loss-against-kiwis-in-onedays-25-147676.html





