ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్.. క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా
Publish Date:Feb 12, 2025
Advertisement
ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లాండ్ లో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి మూడో వన్డేలో టీమ్ ఇండియా బ్యాటర్ శుభమన్ గిల్ సెంచరీ కొట్టాడు. 13 ఫోర్లు 2 సిక్సర్లతో 95 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. వన్డేల్లో గిల్ కు ఇది ఏడో సెంచరీ. చివరకు 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసిన శుబమన్ గిల్ రషీద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. టాస్ గెలిచి ఇంగ్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు మంచి ఆరంభం ఏమీ దక్కలేదు. రెండో వన్డేలో అద్భుత సెంచరీతో రాణించిన స్కిప్పర్ రోహిత్ శర్మ ఈ సారి మాత్రం తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన రోహిత్ శర్మ వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ సాధికారికంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెలెత్తించారు. ఒక వైపు శుభమన్ గిల్, మరో వైపు కోహ్లీ ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఈ క్రమంలో 55 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్ తో 52 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రషీద్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాధికారికంగా ఆడిన కోహ్లీని చూస్తే ఈ వన్డేలో కోహ్లీ తన ఖాతాలో సెంచరీ వేసుకోవడం ఖాయమనిపించింది. అయితే ఒక అద్భుత బంతికి కోహ్లీ ఔటయ్యాడు. ఆ తరువాత కోహ్లీ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆరంభం నుంచే ఫోర్లతో విరుచుకుపడి తన ఉద్దేశాన్ని చాటాడు. శ్రేయస్ అయ్యర్ 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో రషీద్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా వేగంగా పరుగులు చేసే క్రమంలో 9 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తరువాత 12 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన అక్షర్ పటేల్ రూట్ బౌలింగ్ లో బేంటన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తరువాత 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 40 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ మహమూద్ బౌలింగ్ లో లెగ్ బిఫోర్ వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత పది బంతుల్లో ఇక ఫోర్ ఇక సిక్స్ తో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తరువాత వాషింగ్టన్ సుందర్ 14 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరి వికెట్ గా కులదీప్ ఔటయ్యాడు. దీంతో టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో 357 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ లక్ష్య సాధన దిశగా సాగలేదు. ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది. అర్షదీప్ సింగ్ 2, హర్షిత్ రాణా 2, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 2, వాషింగ్టన్ సుందర్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసి ఇంగ్లండ్ ను కుప్పకూల్చారు. దీంతో మూడు వన్డేల సిరీస్ ను టీమ్ ఇండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
http://www.teluguone.com/news/content/india-clean-sweep-one-day-series-with-england-25-192797.html





