పంద్రాగస్టు వేడుకల వేళ విధ్వంసానికి ఉగ్రకుట్ర.!
Publish Date:Aug 11, 2026
Advertisement
పంద్రాగస్టు వేడుకలకు దేశం సమాయత్తమౌతున్న వేళ.. పొరుగుదేశం పాకిస్థాన్ ప్రొద్బలంతో ఉగ్ర కుట్రకు తేరలేచింది. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపును సమయంలో దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో ఉగ్ర సంస్థలు సరిహద్దులు సహా కీలక ప్రాంతాలలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నాయి. ఈ మేరకు నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం అప్రమత్తమైంది. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తూ హైఅలర్ట్ ప్రకటించడమే కాకుండా దేశంలోని కీలక ప్రాంతాలలో నిఘాను ముమ్మరం చేసింది. ప్రస్తుతం పీఓకే, మరియు బలూచిస్థాన్‌లు ప్రజా తిరుగుబాటుతో అట్టుడుకుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడడ అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాజా అశాంతి, ప్రభుత్వ వ్యతిరేకత నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు పాకిస్థాన్.. భారత్ లో విధ్వంసం కుట్రకు తెరలేపిందని పరిశీలకులు అంటున్నారు. పంద్రాగస్టున భద్రతా దళాల దృష్టి దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో జరిగే స్వాతంత్ర్య వేడుకల పైనే ఉంటుందని, ఆ సమయాన్ని అనువుగా తీసుకుని సరిహద్దుల్లో, దేశంలోని కీలక ప్రాంతాలలో ఉగ్రదాడులకు తెగబడేలా కుట్ర పన్నిదని చెబుతున్నారు. కీలక నగరాలే కాకుండా, భద్రత తక్కువగా ఉండే ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా ఉగ్ర దాడులకు వ్యూహం పన్నిందన్నది నిఘా వర్గాల సమాచారం. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో బీఎస్ఎఫ్ పాకిస్థాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దు పొడవునా ఆపరేషన్ అలర్ట్' అధికారికంగా ప్రారంభించింది. ఆగస్టు 10 (సోమవారం) పంద్రాగస్టు వేడుకలు ముగిసిన తరువాత రెండు రోజులు అంటే వచ్చే సోమవారం (ఆగస్టు 17) వరకు వారం రోజుల పాటు ఈ ఆపరేషన్ అలర్ట్ నిరంతరాయంగా సాగనుంది. ఈ ఆపరేషన్ అలర్ట్ లో భాగంగా బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు స్వయంగా సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తారు. సరిహద్దు పొడవునా నిఘా వ్యవస్థను, రాత్రింబవళ్లు కొనసాగే పెట్రోలింగ్‌ను గణనీయంగా పెంచారు. ఎటువంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా తక్షణమే కఠిన చర్యలు తీసుకునేలా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భద్రతా ఏర్పాట్లు పటిష్ఠం చేసింది. Independence Day, terror threat India, BSF Operation Alert, Pakistan ISI terror plot, August 15 security alert India
http://www.teluguone.com/news/content/independence-day-36-228636.html





