అమ‌రావ‌తి  సాక్షిగా  నాలుక‌ల మెలిక‌లు !

Publish Date:Oct 14, 2022

Advertisement

మొన్నెపుడో చెప్పిందొక‌టి ఇపుడు మార్చి ఇదే విన‌మంటే ఎలాగ‌య్యా అంటాడు ప‌క్క‌నున్న‌వాడితో విల‌న్‌. అప్పుడు మ‌న విల‌న్ ఇపుడు రాటుతేలేడుసార్‌.. మ‌నం వ్యూహం మార్చాలి, మాట‌లూ మార్చి ఇత‌రుల‌ను బుట్ట‌లో వేసుకోవాలి.. అపుడే అన్ని ద‌క్కుతాయి.. వినండి. అంటాడు. వెంట‌నే మాట మార్చి ఫైటింగ్‌కి సిద్ధ‌మ‌వుతాడు. కానీ ఊరివాళ్లంతా త‌న్ని బ‌య‌ట‌కు నెట్టేస్తారు. దాదాపు ఇలాంటి సీన్‌కి ప‌రిస్థితులు సిద్ధ‌మ‌వుతున్నాయా అన్నఅనుమానం క‌లుగుతోంది ఏపీ ప్ర‌భుత్వానికి  రాజ‌ధాని అంశం లో. ఎందుకంటే అధికారంలోకి రావ‌డానికి ముందు, అధికారంలోకి వ‌చ్చాక మ‌రో మాట చెప్ప‌డంలో నాయ కుల నాలుక‌లు తాటాకుల్లా మార‌డం ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని అనుకుని గూగుల్ మ్యాప్‌వారూ దాన్నే ప్ర‌క‌టించినా, వైసీపీ స‌ర్కార్ మాత్రం ఇపుడు రైతాంగం మాట‌నీ కాద‌ని ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం అని బోర్డు పెట్టుకుని విశాఖ‌, క‌ర్నూలు, గుంటూరు.. అంటూ అదేదో సినిమాలో క‌మెడి య‌న్ చెప్పిన‌న్ని ఊళ్ల‌పేర్లు చెబుతూ పోతున్నారు. పెద్ద‌ది గ‌నుక విశాఖ ను ఎక్కువ చెబుతున్నారు. ఇపుడు అదే కావాల‌ని గొంతు మార్చి వైసీపీ నాయ‌కులంతా ప్ర‌చారం చేయ‌డం వెనుక జ‌గ‌న్తో వారికి బంధాన్ని అంత త్వ‌ర‌గా వ‌దులుకోద‌ల్చుకొన‌క‌పోవ‌డ‌మేనా?  కానీ మాట మార్చి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నాలు ప‌నిచేయ‌వు. ప్ర‌జ‌లు, ఓట‌రు నాయ‌కుల్లా కాదు.. చాలా తెలివి మీరారు. ఎవ‌రు ఏమిట‌న్న‌ది ఇపుడు చ‌క్క‌గా బేరీజు వేసుకోగ‌ల్గుతున్నారు. అందుకే నిటారుగ నిల‌బ‌డి, గ‌ట్టిగానే స‌మాధానాలు చెబు తున్నారు. 

శ్రీ‌కృష్ణ‌క‌మిష‌న్ నివేదిక ఆధారంగానే అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించారు. కానీ  ఈ  ప్రాంత‌మంతా ముంపున‌కు  గుర‌య్యే ప్రాంతం. కృష్ణా న‌దికి  8 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటి ప్ర‌వాహానికే  ఈ ప్రాంతం చాలా దెబ్బతిన్న‌ది. భ‌విష్య‌త్తులో 11 ల‌క్ష‌ల క్యూసెక్కుల ప్ర‌వాహానికి నిల‌వ‌గ‌లగ‌డం అసాధ్యం. అన్ని విధాలా ఆలో చించే ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌ని 2019లో బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు.  కానీ విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రాజ‌ధాని అమ‌రావ‌తే ఉండాల‌ని కొత్త ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది, దీన్ని ప్ర‌తిప‌క్షంగా తాము అంగీకరిస్తున్నామ‌న్నారు. అంతేకాదు తాము అధికారంలోకి వ‌చ్చినా దీనికే క‌ట్టుబ‌డి ఉంటామ‌ని, భూదం దాలు చేసేవారే మారుస్తారు గానీ మేము మార్చేదే లేద‌ని ఇదే బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ విప‌క్ష పార్టీ నేత‌గా ఎన్నిక‌ల ముందు అన్నారు. రాజ‌ధాని విష‌యంలో నిపుణుల క‌మిటీ నివేదిక అనుస‌రించే అన్నీ జ‌రుగు తాయ‌ని, ఈప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామ‌ని, భ‌వ‌నాల నిర్మానం పూర్తి చేస్తామ‌ని ఆయ‌న 2019 న‌వంబ‌ర్‌లో అన్నారు. అంతేగాక  భూస‌మీక‌ర‌ణ ఒప్పందం అనుస‌రించి గ‌త ప్ర‌భుత్వం రైతుల‌కు ఇచ్చి న హామీల‌ను నెర‌వేరుస్తామ‌ని అన్నారు. 2020 జ‌న‌వ‌రిలో మాత్రం సిఆర్ డిఏ గురించి విరుద్ధంగా మాట్లా డారు. గ‌త ప్ర‌భుత్వం దీనివల్ల ఇత‌ర ప్రాంతాల అభివృద్ధిని నిర్ల‌క్ష్యం చేసింది గ‌నుక సిఆర్‌డిఏ చ‌ట్టాన్నే వ‌ద్ద‌న్నారు. విశాఖ, క‌ర్నూలు అభివృద్ధిని ఎలా నిరోధిస్తారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని త‌మ ప్ర‌భుత్వం ఆశిస్తోంద‌ని బొత్స అన్నారు. ఆ  త‌ర్వాత మూడు రాజ‌ధానులు పాల‌నా సౌల‌భ్యానికే అన్న‌ది గుర్తించాల‌ని, ఇందులో త‌ప్పు ప‌ట్టాల్సింది, తీవ్రంగా వ్య‌తిరేకించాల్సిన అంశ‌ మేమీ లేద‌ని రౌండ్‌టేబుల్ స‌మా వేశంలో గ‌ట్టిగా ప్ర‌స్తావించారు. రాష్ట్ర మంత్రిగా  బొత్స ఒకే అంశం మీద ఇన్ని ర‌కాల అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసి రాష్ట్ర ప్ర‌జ‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ప్ర‌భుత్వ ఆలోచ‌న ఎన్ని ర‌కాలుగా మారిస్తే  అన్నివిధాలుగా పోపు వేసి ప్ర‌చారం చేయ‌డం, విప‌క్షాలపై విరుచుకు ప‌డ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ముందు ప్ర‌క‌టిం చిన దానికి, చెప్పిన‌దానికి , ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌కూ పొంత‌న లేకుండా ఉండ‌టం వైసీపీ ప్ర‌భుత్వానికే చెల్లిం ద‌న్న‌ది ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌వుతోంది.  రాజ‌ధాని విష‌యం ఎంతో కీల‌కాంశం. దీనిలోనే అనేక వొంకరులు పోవ‌డం విడ్డూర‌మే. పైగా రియ‌ల్ ఎస్టేట్ ఒప్పందంతోనే రైతులు భూములిచ్చార‌న‌డం రైతాంగాన్ని అవ మానించ‌డం కాదా అని విశ్లేష‌కులూ ప్ర‌శ్నించారు. 

మ‌రో చిత్ర‌మేమంటే, విప‌క్షంలో ఉన్న‌పుడు అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఉండాల‌న్నదానికి మద్ద‌తుగా ప్ర‌క‌ట న‌లు చేసిన ధ‌ర్మాన ఆ త‌ర్వాత గుంటూరు రాజ‌ధాని రాజ‌ధాని చేయ‌డానికి ఎందుకు వీలు కాద‌ని అన్నా రు. అధికారంలోకి రాగానే మాట‌మార్చ‌డం గ‌మ‌నించాం. 2019లో విశాఖ‌ను రాజ‌ధాని చేయ‌డానికి  అడ్డుకు నేవారిని అస్స‌లు క్ష‌మించ‌ద‌ని ఇదే ధ‌ర్మాన విజ‌య‌న‌గ‌రం ప్రాంతంలో ఒక  బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌జ‌ల్ని దాదాపు రెచ్చ‌గొట్టే ప్ర‌సంగ‌మే చేశారు. 

వైసీపీ మ‌రో నేత అవంతి శ్రీ‌నివాస్ అయితే అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని మార్చాల్సిందేన‌ని, అలాగా కుంటే ఉత్త‌రాంధ్ర అభివృద్ధి అసాధ్య‌మ‌న్న‌ది విప‌క్షాల‌కు వినిపించేలా అన్నారు. అంటే వైసీపీ అధి నేత మాట‌కు, అడుగుల‌కు ప్ర‌చార‌కులుగా మార‌డం త‌ప్ప మ‌రో ఆలోచ‌నే లేద‌న్న‌ది వీరి ప్ర‌క‌ట‌న‌ల్లో డొల్ల త‌నం తెలియ‌జేస్తుంది. 

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.