చంద్రబాబు, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు

Publish Date:Jan 27, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది.   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో త్వరలో పేర్నికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. వైసీపీలో ఒకింత యాక్టివ్ గా ఉన్న కొద్ది మంది నేతలలో ఒకరైన పేర్ని నాని దూకుడుకు కళ్లెం పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

  ఏలూరు జిల్లా చాట్రాయిలో రెండు రోజుల కిందట జరిగిన  వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో  పాల్గొన్న పేర్ని చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ పై  అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. దీనిపై  ఆయన స్వస్థలం బందరులో టీడీపీ శ్రేణులు ఫైర్ అయ్యాయి. స్థానిక ఇనగుదురుపేట పీఎస్ లో టీడీపీ నేతలు పేర్నినాని వ్యాఖ్యలపై  ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు పేర్ని నానిపై బీఎన్ఎస్ సెక్షన్లు 196(1), 353(2), 351(2), 352 కింద కేసు నమోదు చేశారు. 

కాగా, గతంలోనూ పేర్నినాని వివిధ సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు కూడా.  కానీ ఈసారి   పేర్నినాని చేసిన కామెంట్స్ పై టీడీపీ, జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి.  పేర్ని నానిపై చర్యలు తీసుకోవలసిందేనని పట్టుబడుతున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా ఇష్టారీతిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సీరియస్ గా ఉంది. ప్రస్తుతం వైసీపీలోలో యాక్టివ్ గా ఉన్న అతి తక్కువ మంది నాయకులలో ఒకరైన పేర్ని నాని వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీంతో తాజాగా నమోదైన కేసు విషయంలో పోలీసులు చర్యలకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో ఆయన చిక్కుల్లో పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.