Publish Date:Jan 27, 2026
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో త్వరలో పేర్నికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. వైసీపీలో ఒకింత యాక్టివ్ గా ఉన్న కొద్ది మంది నేతలలో ఒకరైన పేర్ని నాని దూకుడుకు కళ్లెం పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఏలూరు జిల్లా చాట్రాయిలో రెండు రోజుల కిందట జరిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పేర్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. దీనిపై ఆయన స్వస్థలం బందరులో టీడీపీ శ్రేణులు ఫైర్ అయ్యాయి. స్థానిక ఇనగుదురుపేట పీఎస్ లో టీడీపీ నేతలు పేర్నినాని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు పేర్ని నానిపై బీఎన్ఎస్ సెక్షన్లు 196(1), 353(2), 351(2), 352 కింద కేసు నమోదు చేశారు.
కాగా, గతంలోనూ పేర్నినాని వివిధ సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు కూడా. కానీ ఈసారి పేర్నినాని చేసిన కామెంట్స్ పై టీడీపీ, జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి. పేర్ని నానిపై చర్యలు తీసుకోవలసిందేనని పట్టుబడుతున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా ఇష్టారీతిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సీరియస్ గా ఉంది. ప్రస్తుతం వైసీపీలోలో యాక్టివ్ గా ఉన్న అతి తక్కువ మంది నాయకులలో ఒకరైన పేర్ని నాని వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీంతో తాజాగా నమోదైన కేసు విషయంలో పోలీసులు చర్యలకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో ఆయన చిక్కుల్లో పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/inappropriate-comments-on-cbn-and-pawan-25-213090.html
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.