దీపావళి సామాన్ల రూపంలో పేలుడు పదార్ధాల అక్రమ రవాణా
Publish Date:Mar 21, 2012
Advertisement
తమిళనాడు నుంచి మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ప్రాణాంతక పేలుడు పదార్ధాలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. క్వారీల్లో ఉపయోగించే డిటోనేటర్లు, జిలెటన్ స్టిక్స్ పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. వీటితోపాటు మందుగుండు సామాన్ల రూపంలో ప్రమాదకర పేలుడు పదార్ధాలను కూడా రాష్ట్రంలోకి అక్రమంగా చేరవేస్తున్నారు, రాయలసీమ, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో క్వారీల తవ్వకాలకు ఉపయోగించే డిటోనేటర్లను చేపల వేటకు ఉపయోగిస్తున్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద చెరువులు, నదీజలాల్లో చేపల గుంపు ఉన్నచోట నీళ్ళలో ఈ డిటోనేటర్లను పేల్చుతున్నారు. ఈ పేలుళ్ళధాటికి చేపలు చనిపోయి నీటిపై తేలాడుతున్నాయి. దీంతో వాటిని సునాయాసంగా పట్టుకుని మార్కెట్లో విక్రయిస్తున్నారు. నిజానికి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల వాడకానికి, వ్యాపారానికి చెన్నైలోని ఎక్స్ ప్లోజిన్ విభాగం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి అనుమతులు లేకుండానే తెలంగాణా, రాయలసీమలకు చెందిన కొంత మంది వ్యాపారులు వీటిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా తరలించిన పేలుడు పదార్ధాల్లో కొన్ని మావోయిస్టు గ్రూపులకు కూడా చేరుతున్నాయి. ఈ పేలుడు పదార్ధాలను రవాణా చేసేందుకు ఉపయోగించే వాహనాలు ప్రత్యేకంగా ఉండడంతో పాటు వాటికి సీల్ చేసి పంపిస్తుంటారు. దీంతో పేలుడు పదార్ధాలు ఆ వాహనాల్లో ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునే అవకాశం కూడా చెక్ పోస్టుల వద్ద అధికారులకు ఉండదు. తమను తనిఖీ చేసేవారు లేరన్న ధీమాతో వ్యాపారులు నిర్భయంగా పేలుడు పదార్ధాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
http://www.teluguone.com/news/content/illigal-business-fireworks-24-12810.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





