హైదరాబాద్‌లో ఏనుగు దంతాల అక్రమ దందా: గుట్టురట్టు.!

Publish Date:Oct 2, 2026

Advertisement

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు. అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఏనుగులను పట్టుకుని వాటి దంతాలను కట్ చేయడంతో పాటు, వాటిని అక్రమంగా విక్రయించేందు కు ప్రయత్ని స్తున్నట్లుగా విశ్వసనీయమైన సమా చారం రావడంతో డీఆర్‌ఐ అధికారులు వెంటనే రంగంలోకి దిగి నిఘా పెట్టారు.ఈ నేపథ్యంలోనే ముగ్గురు వ్యక్తులు ఏనుగు దంతాలు, ఐవరీ వస్తువులు తీసుకుని హైదరాబాద్ నగరానికి వచ్చారు. విక్రయానికి సంబంధించిన లావాదేవీలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా డీఆర్‌ఐ అధికారులు రంగంలోకి దిగి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి సుమారు 17 కిలోల బరువున్న నాలుగు ఏనుగు దంతాలు, వాటితో నైపుణ్యంగా చెక్కిన ఐవరీ వస్తువులు (ట్రోఫీలు) స్వాధీనం చేసుకున్నారు. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్, 1972లోని సంబంధిత నిబంధనల ప్రకారం వాటిని అధికారులు సీజ్ చేశారు.ఏనుగు దంతాలు, వాటితో తయారు చేసిన వస్తువులను విక్రయించడం, వ్యాపారం చేయడం లేదా వాటిని ఉపయోగించడం చట్టప్రకారం నిషేధం.దేశవ్యాప్తంగా వన్యప్రాణుల నేరాల నియంత్రణకు డీఆర్‌ఐ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అక్రమంగా వన్యప్రాణులను తరలించడం, రక్షిత జాతులకు చెందిన జంతువుల నుంచి తయారైన వస్తువులను అక్రమంగా రవాణా చేయడం లేదా వాటితో వ్యాపారం చేయడం వంటి వాటిపై నిఘా పెట్టి ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు మద్దతుగా, వ్యవస్థీకృత వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకునే చర్యల్లో భాగంగానే తాజాగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.

 

 

 

[ Illegal sale of elephant tusks uncovered, Hyderabad, DRI officials, Wild Life Protection Act, CM Revanth reddy, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.