పని చేయకపోతే ఇంట్లో కూర్చొండి: ఖర్గే
Publish Date:Apr 9, 2025
Advertisement
ఎఐసిసి చీఫ్ మల్లి ఖార్జున్ ఖర్గే బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కష్ట పడి పని చేయకపోతే ఇంట్లో కూర్చొండి అని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని నేతలపై చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమైంది. కష్టపడి పని చేసే వారికే టికెట్లు ఇవ్వనున్నట్లు ఖర్గే చెప్పారు. బాధ్యతలు తీసుకోనివారు విశ్రాంతి తీసుకోవచ్చన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే మాట్లాడారు. బిజెపి మతకలహాలను ప్రోత్సహించిందన్నారు. ఈ వర్కింగ్ కమిటీ సమావేశంలోనే బిజెపిని గద్దెదించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటి పిలుపు నిచ్చింది. ప్రధాని మోది స్వంత రాష్ట్రమైన గుజరాత్ లో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత చోటు చేసుకుంది.
http://www.teluguone.com/news/content/if-you-are-not-working-39-195915.html





