సంక్షేమం గీత దాటితే సంక్షోభమే!

Publish Date:Jul 13, 2022

Advertisement

శ్రీ లంకలో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపధ్యంలో చెలరేగిన ప్రజాందోళనలు, హింసాత్మక సంఘటనలపై మన దేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో, అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంపై విభిన్న కోణాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అధికార పీఠాన్ని అందుకునేందుకు, రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాలు, ఉచిత వరాలను నిచ్చెనలుగా చేసుకుని, అధికారానికి అడ్డ దారిగా, దగ్గరి దారి (షార్ట్కట్) గా భావిస్తున్న నేపధ్యంలో, ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతోందనే, వాదన బలాన్ని పుంజుకుంటోంది. 

నిజమే. సంక్షేమం గీత దాటితే సంక్షోభం తప్పదని ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలలో, ప్రభుత్వాలు, ‘ఓటు బ్యాంక్’ పథకాలకు పెద్ద పీట వేస్తున్నాయి. అప్పులు చేసి మరీ  పతకాలు అమలు చేస్తున్నాయి. మీటలు నొక్కి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. అందుకే ఇటీవల ఏపీ ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి, నొక్కిన మీటల లెక్కలు చెప్పి, మొత్తం 175 సీట్లు తమవే అన్న ధీమాను వ్యక్తపరిచారు. ఇలా ప్రజలను ఓటర్లుగా, ఓటర్లను అమ్ముడుపోయే సరుకుగా భావించి అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

ఫలితంగా రాష్ట్రాలు అప్పుల్లో కూరుకు పోవడంతో పాటుగా,ప్రభుత్వ ఉద్యోగులకు  సకాలంలో  జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. అలాగే, అప్పుల భారం పెరిగే కొద్దీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయలేక పోతున్నాయి. కోతలు విధిస్తున్నాయి. చేతులేత్తెస్తున్నాయి. మరో వంక అభివృద్ధి, దీర్ఘకాల సుస్థిర ప్రయోజనాలపై ప్రభుత్వాలు దృష్టి నిలపలేక పోతున్నాయి. శ్రీ లంకలో జరిగింది అదే, అందుకే మన దేశంలోనూ శ్రీ లంక తరహా పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఘటికలు వినిపిస్తున్నాయని, హెచ్చరికలు వినవస్తున్నాయి. 

ఈ నేపధ్యంలో ప్రధాన మంత్రి నత్రి నరేద్ర మోడీ, షార్ట్కట్ రాజకీయాలు.. దేశానికి అతిపెద్ద సవాలుగా మారాయని, చేసిన వ్యాఖ్యాలు ఇప్పడు దేశంలో ప్రధాన చర్చనీయంశాలు అయ్యాయి. ప్రధాన మంత్రి మోడీ, ప్రత్యేకించి ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయక పోయినా, షార్ట్కట్ రాజకీయాలపై ఆధారపడితే,  షార్ట్ సర్క్యూట్ ఖాయమని చేసిన హెచ్చరిక మాత్రం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా అందరికీ వర్తిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఝార్ఖండ్లోని దేవ్గఢ్లో రూ.16,800 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు  ఏపీ, తెలంగాన స్టేట్ గవర్నమెంట్స్’ సీరియస్’గా తీసుకోవాలని  అంటున్నారు. ప్రధాని మోడీ ఎక్కడా ఎవరి పేరూ ప్రస్తావించక పోయినా, ఓట్ల కోసం అమలు చేసే ప్రజాకర్షక పథకాలు దేశాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు అలాంటి పథకాలు ప్రకటించడాన్ని షార్ట్కట్ రాజకీయాలుగా అభివర్ణించారు.

వీటిపై ఆధారపడితే షార్ట్ సర్క్యూట్ తప్పదని స్పష్టం చేశారు.. షార్ట్కట్ రాజకీయంతో దేశమే ధ్వంసం అవుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి.. మనమంతా కఠోర శ్రమతో నవభారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి. ప్రజాకర్షక పథకాలతో ఓట్లు సంపాదించడం సులువే. కానీ.. అలాంటి షార్ట్కట్లు అవలంబిస్తే దీర్ఘకాలిక దుష్పరిణామాలు ఉంటాయి" అని హెచ్చరించారు.

నిజానికి ప్రధాని  మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితి గతులు, అప్పులు ఆదాయాలపై దృష్టిని కేంద్రేర కరించింది. ముఖ్యంగా, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు ఉల్లంఘించి, కార్పొరేషన్ల పేరిట అడ్డదారిలో చేస్తున్న అప్పులకు సంకెళ్ళు  బిగించేందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా అప్పులు చేయకుండా రాష్ట్రాల రుణ పరిమితిని ఎప్పటికప్పుడ్డు సమీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే, కేంద్ర తేసుకున్న కటిన చర్యలు సహజంగానే రాష్ట్ర  ప్రభుత్వాలకు రుచించడం లేదు. అయితే, ఆర్థిక నిపుణులు, చివరకు రాష్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అధికారులు కూడా, దీర్ఘకాల ప్రయోజనాలు, సుస్థిర అభివృద్ధి సాధించాలంటే,ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరని, బెల్ట్స్ బిగించిక తప్పదని అంటున్నారు. అలాగే, శ్రీ లంక పరిణామాల నేపధ్యంలో, ప్రజలు కూడా, సంక్షేమం గీతదాటితే సంక్షోభమే, అనే వాస్తవాన్ని గుర్తిస్తున్నారని అంటున్నారు. ఒక విధంగా శ్రీ లంక పరిణామాలను ఒక గుణపాఠంగా తీసుకోవాలని అంటున్నారు.

By
en-us Political News

  
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.