పీసీసీ పగ్గాలు సరే.. కారు, కాంగ్రెస్ కలిస్తే? రేవంత్ దారేది..? 

Publish Date:Jun 23, 2021

Advertisement

రేపోమాపో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరు ప్ర‌క‌ట‌న‌. ఇప్ప‌టికే ఖ‌రారైనా ఎందుకో ఆల‌స్యం అవుతోంది. హ‌స్తిన‌లోనే మ‌కాం వేసిన రేవంత్‌.. త‌న పేరు ప్ర‌క‌టించే దాకా ఢిల్లీని వీడేలా లేరు. కోమ‌టిరెడ్డి నుంచి గ‌ట్టి పోటీ వ‌స్తున్నా.. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌నే ఫుల్‌రేంజ్ ప్రెసిడెంట్‌గా చేసేందుకు హైక‌మాండ్ సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. సీనియ‌ర్లు అసంతృప్తితో ర‌గిలిపోతున్నా.. వారిని ఏదో ఒక ప‌ద‌వితో సంతృప్తి ప‌రిచేలా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. అందుకే మ‌రింత ఆల‌స్యం అవుతోంద‌ని స‌మ‌చారం. 

లేటైనా.. లేటెస్ట్‌గా జెట్ స్పీడ్‌తో దూసుకురాబోతున్నారు రేవంత్‌రెడ్డి. ఆయ‌న టార్గెట్ ఒక్క‌టే. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావ‌డం.. అనేక‌న్నా.. తాను ముఖ్య‌మంత్రి కావ‌డం.. కేసీఆర్‌ను ఒక్క‌రోజైనా జైల్లో కూర్చోబెట్ట‌డం. ఇదే ఆ డైన‌మిక్ లీడ‌ర్ జీవిత‌ల‌క్ష్యం. ఆ టార్గెట్‌ను రీచ్ అవ‌డానికి ఆయ‌న ముందున్న బెస్ట్ ఆప్ష‌న్ కాంగ్రెస్. అందుకే, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాక‌.. ఇక టీడీపీతో వ‌ర్క‌వుట్ కాద‌ని.. హ‌స్తం పార్టీని ఆశ్ర‌యించారు. అన‌తికాలంలోనే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ పోస్ట్‌కు అడుగు దూరంలో ఉన్నారు. ప‌ద‌వి ప‌ట్టి.. కేసీఆర్‌ను కొట్టాల‌నేది రేవంత్ టార్గెట్‌. కానీ....

రాజ‌కీయాల్లో ఈ 'కానీ' కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. 'కానీ' అనే ప‌దం క‌నిపించిందో ఏదో తేడా ఉన్న‌ట్టే. రేవంత్ లెక్కంతా బాగానే ఉంది. స‌మ‌ర్థుడు, స‌రైనోడు, స‌త్తా ఉన్నోడు.. రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్‌కు అన్నీ అడ్వాంటేజీలే. కానీ, అది ప్రాంతీయ పార్టీ కాక‌పోవ‌డం.. రేవంత్ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ కాక‌పోవ‌డం.. ప్ర‌తీదానికీ హైక‌మాండ్ ప‌ర్మిష‌న్ త‌ప్ప‌నిస‌రి కావ‌డం.. ఆయ‌న‌కు పెద్ద మైన‌స్‌. ఎంత స్వ‌తంత్ర నిర్ణ‌యాలు తీసుకోవాల‌నుకున్న‌.. ఆ స్వ‌తంత్ర‌త అధిష్టానం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే ఉండాలి. అంతేకానీ, కేసీఆర్‌ను జైల్లో పెడ‌తా.. కేసీఆర్‌ను కుమ్మేస్తా.. అంటేకూడా దానికి 10-జ‌న్‌ప‌థ్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వాలి. ఇక్క‌డే య‌వ్వారం బెడిసికొట్టేలా ఉంది. రేవంత్‌రెడ్డి పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టాక.. కేసీఆర్‌పై దూకుడుగా ముందుకెళ్లాక‌.. చివ‌రాఖ‌రును వ్యూహం బెడిసికొడితే? మాయ‌ల మ‌రాఠి కేసీఆర్.. రేవంత్ ఎదురుదాడిని కాచుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి న‌రుక్కొస్తే..?  అప్పుడు రేవంత్‌రెడ్డి ప‌రిస్థితి ఏంట‌నేది చెప్ప‌డం క‌ష్టం. ఎందుకంటే, జాతీయ స్థాయిలో ప‌రిణామాలు అంత వేగంగా మారుతున్నాయి కాబట్టే.. ఇలాంటి అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

మోదీని గ‌ద్దె దింపేందుకు, రాహుల్‌ను ప్ర‌ధాని చేసేందుకు... పాపుల‌ర్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిశోర్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇప్ప‌టికే శ‌ర‌ద్‌ప‌వార్‌తో పాటు ప‌లు పార్టీల అధినేత‌లు, ముఖ్య‌మంత్రులతో ఓ ద‌ఫా చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. అందులో భాగంగా యూపీఏ కూట‌మిలో భాగ‌స్వామ్యం చేసేందుకు కేసీఆర్‌నూ లైన్లో పెట్టార‌ని అంటున్నారు. అదే నిజ‌మైతే.. అది రేవంత్‌రెడ్డికి ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే. రాహుల్‌గాంధీని ప్ర‌ధాని చేయ‌డ‌మే కాంగ్రెస్ ఏకైక ల‌క్ష్యం. ఆ గోల్ రీచ్ అవ‌డానికే రేవంత్‌రెడ్డిలాంటి లీడ‌ర్ల‌ను వాడుకుంటుంది కానీ.. రేవంత్‌కు మంచి చేయాల‌నేది కాంగ్రెస్ ఉద్దేశ్యం కానేకాదు. ఆ లెక్క‌న‌.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో యూపీఏ కూట‌మికి  కేసీఆర్ స‌పోర్ట్ అవ‌స‌ర‌మైతే.. ఆ రెండు పార్టీలు నిస్సందేహంగా క‌లిపిపోతాయ‌ని అంటున్నారు. గ‌తంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర‌ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న చ‌రిత్ర కేసీఆర్‌ది కాబ‌ట్టి.. మ‌రోసారీ అలా జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెబుతున్నారు. 

మ‌రి, ఆ అంచ‌నానే నిజ‌మైతే.. రేవంత్‌రెడ్డి ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిగా మారే ప్ర‌మాదం ఉంది. పీసీసీ చీఫ్‌గా రానున్న రెండున్న‌రేళ్లు కేసీఆర్‌తో యుద్ధం చేసి.. క్లైమాక్స్‌లో అంతా తూచ్.. మ‌నం మ‌నం ఒక‌టే అనే ప‌రిస్థితే వ‌స్తే..? హైక‌మాండ్‌ను ఎదిరించ‌నూ లేడు.. అలాగ‌ని కేసీఆర్‌తో చేతులు క‌ల‌ప‌నూ లేడు.. అస్స‌లు కాంప్ర‌మైజ్ అయ్యే ర‌కం కానేకాదు రేవంత్‌రెడ్డి. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే అంటారు కాబ‌ట్టి.. త‌ప్ప‌నిస‌రి అయితే అటు కాంగ్రెస్ కేసీఆర్ మ‌ద్ద‌తు తీసుకోవ‌చ్చు.. ఇటు కేసీఆర్ సైతం కాంగ్రెస్‌కు జై కొట్టొచ్చు. మ‌ధ్య‌లో రేవంత్‌రెడ్డే ఆగ‌మ‌య్యేలా ఉన్నాడ‌ని అంటున్నారు. అందుకే, పీసీసీ చీఫ్ కాగానే పండ‌గ కాద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను ఓడించ‌డం ఎంత‌ముఖ్య‌మో.. టీఆర్ఎస్‌-కాంగ్రెస్ క‌ల‌వ‌కుండా ఉండ‌ట‌మూ అంతే ముఖ్యం. అందుకే, రేవంత్‌రెడ్డి భ‌విష్య‌త్తు ఆయ‌న చేతుల్లో కాకుండా.. కేసీఆర్‌-రాహుల్‌గాంధీ అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఉండ‌బోతోందని అంచ‌నా వేస్తున్నారు. అస‌లు జ‌రుగుతుందో లేదో తెలీని ఊహాత్మ‌క అంచ‌నాల‌ను ప‌ట్టించుకోకుండా.. కేవ‌లం వ‌ర్త‌మానాన్ని మాత్ర‌మే దృష్టిలో పెట్టుకొని త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడు రేవంత్‌రెడ్డి. అందులో భాగంగా త‌న ఫ‌స్ట్ టార్గెట్ పీసీసీ చీఫ్ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఇక రేవంత్ నెక్ట్స్ టార్గెట్‌.. కేసీఆర్‌ను ఢీ కొట్ట‌డ‌మే.. దేత్త‌డి.. పోచ‌మ్మ గుడి....

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.