Publish Date:Aug 22, 2025
ఓ సైబరాబాద్.. ఓ కియా ఫ్యాక్టరీ
ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆ తల్లి పడే ప్రసవవేదన ఏమిటో మన అందరికీ తెలిసిందే… అలాగే ఒక పరిశ్రమ … ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు కోల్పోయే రైతులు పడే ఆవేదన అంతకు ఏ మాత్రం తక్కువ కాదు. తాను జన్మనిచ్చిన బిడ్డ బుడిబుడి నడకలు వేస్తూ… బోసినవ్వుల మాటలు చెబుతూ ఉంటే ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు… అలాగే పరిశ్రమలు , ప్రాజెక్టులు పూర్తయి ఫలాలు అందరికీ అందినప్పుడూ ప్రజల ఆనందం, వారి అనుభూతి మాటల్లో చెప్పలేనిదనడంలో సందేహం లేదు.
దీనికి ఉదాహరణే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలు….. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో గిట్టని వాళ్ళు చేసిన విమర్శలు… హేళనలు అన్నీ ఇన్నీ కావు.. కానీ నేడు అదే హైటెక్ సిటీ ఒక కొత్త నగరాన్నే నిర్మించింది.. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచింది… రాష్ట్రం విడిపోయాక ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి గా చంద్రబాబు దూరదృష్టి తో ఆవిష్కరించినదే కియా కార్ల తయారీ పరిశ్రమ… కరవు కాటకాలకు నెలవైన అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతంలో కార్ల తయారీ కర్మాగారాన్ని 536 ఎకరాలను కేటాయించారు.. కొండలు .. గుట్టలతో ఉన్న ఆ ప్రాంతాన్ని చదును చేసి కియా కార్ల కంపెనీకి అప్పగించారు. కర్మాగారానికి అవసరమైన నీటిని కూడా కేటాయిస్తూ జీవోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో హైటెక్ నిర్మాణం చేపట్టినప్పుడు ఎదురైన విమర్శలే ఇక్కడా వినిపించాయి.. అయినా చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ముందడుగు వేశారు.
కరువు సీమలో నీటిని సాగుభూములకు ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారని విపక్షాలు విమర్శలు చేశాయి. కానీ కర్మాగారం వస్తే ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందో రైతులకు వివరించి మరీ ఒప్పించారు చంద్రబాబు. 2017లో కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2019 నాటికి ఉత్పత్తి ప్రారంభించగానే.. మొదటి ఏడాదిలోనే 50 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేసిన కియా కంపెనీ, 2025 నాటికి 15 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది…ఏటా 3 లక్షల కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలన్న లక్ష్యంగా మూడో షిఫ్ట్ జోడించారు. చంద్రబాబు హయాంలో కర్మాగారం పనులు సాఫీగా సాగాయి. ప్రభుత్వం మారాక కొన్ని బాలరిష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అప్పటి అధికార పార్టీ నాయకుల దందాల రానఫంగా. కియా అనుబంధ పరిశ్రమను తమిళనాడుకు తరలించే ప్రయత్నాలూ జరిగాయి. కియా పరిశ్రమ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు కృషి ప్రస్తుతం ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడింది. గతంలో భూములు అమ్ముకుందామంటే కొనే దిక్కులేదు. కాని నేడు పరిస్థితి అందు కు పూర్తి భిన్నంగా ఉయారైంది. అందుకే దార్శనికుడు పాలకుడితే రాష్ట్ర పురోగతి ఎలా ఉంటుందో కి యా పరిశ్రమ ను చూస్తేనే తెలుస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/if--visionary-is-the-ruler-39-204765.html
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.