ఆయుష్ నివేదికే ఫైనల్! ఆనందయ్య మందుకు అనుమతిచ్చే ఛాన్స్... 

Publish Date:May 24, 2021

Advertisement

నెల్లూరు జిల్లా  కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆనందయ్య మందు   కరోనాపై పనిచేస్తుందా లేదా అనే విషయంపై అధ్యయనం చేసేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధుల బృందం కృష్ణపట్నం వస్తుందని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. కాని ఎవరూ రాలేదు. ఐసీఎంఆర్ నుంచి ఎవరూ కృష్ణపట్నం రావడం లేదని తెలుస్తోంది. ఐసీఎంఆర్ ఇక్కడికి వస్తే.. ఆనందయ్య మందు వినియోగించాలా వద్దా అనే విషయంపై క్లారిటీ వస్తుందని అంతా ఆశించారు. ఇప్పుడు ఐసీఎంఆర్ పర్యటన రద్దుతో ఆనందయ్య మందు కోసం ఎదురుచూస్తున్న జనాలు నిరాశ పడ్డారు. 

ఆనందయ్య మందుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అధ్యయన నివేదికను త్వరగా ఇవ్వాలని ఆయుష్ శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సోమవారమే రాత్రి వరకు ఆయూష్.. ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు ఇప్పటికే ప్రకటించారు. అది ఆయుర్వేద మందు కాదని.. దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవీ ఇందులో పాటించట్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని… కాబట్టి ఇది అంత హానికరం కాదని కూడా ఆయుష్ కమిషనర్ స్పష్టం చేశారు. కంటిలో వేసే డ్రాప్స్‌లోనూ సాధారణ పదార్థాలే ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య ఈ మందును తయారు చేశారు. వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని పరిశీలించారు. దీంతో ఆనందయ్య మందుకు ఆయుష్ విభాగం అనుమతి ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

నెల్లూరు జిల్లాకు  ఐసీఎంఆర్ అధికారులు రావడం లేదని, ఆయుష్ నివేదికనే ప్రభుత్వం ఫైనల్ చేసే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఆయుష్ నివేదిక రాగానే మందు పంపిణిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆనందయ్య మందుపై సర్కార్ నుంచి సానుకూల నిర్ణయమే వచ్చే అవకాశం ఉందన్నారు. మందుకు అనుమతి రాగానే... పంపిణి కోసం ఏర్పాట్లు చేస్తామన్నారు. జనాలెవరు కృష్ణపట్నం రావొద్దని... కావాల్సిన వారందరికి మందు అందేలా తాము చర్యలు తీసుకుంటామని కాకాణి తెలిపారు. 

ఆనందయ్య ఇస్తున్న మందుపై పరిశోధన చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఆయుర్వేద విభాగంలో ఆనందయ్య మందును అభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. అనుమతి రాకపోయినా ఇమ్యూనిటీ బూస్టర్లుగా వాడుతామన్నారు. ఆయుష్ శాఖ దీనికి ఆమోదముద్ర వేస్తే నరసింగాపురంలోని శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో దీన్ని తయారుచేయవచ్చునని టీటీడీ ఆయుర్వేదిక్ ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. తమ పరిశీలనలో మందు తయారీకి సంబంధించి ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని ప్రకటించారు.

మరోవైపు ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ అనుమతి కోసం హైకోర్టు న్యాయవాది యలమంజుల బాలాజీ దరఖాస్తు చేశారు. అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు తరపున పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని, ఈ మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఆకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేసిందని, దీనివల్ల అనేక మంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని తెలిపారు. విచారణకు అనుమతించాలని న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టుకు లేఖ రాశారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.