కొనుక్కతింటే రోగ మస్తది పుణ్యానికొస్తే రోగం లేదు గీగం లేదు అన్నట్టు ఉంది తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియుల వ్యవహారం. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయంతో కొన్ని రోజుల నుంచి చికెన్ తినడమే బంద్ చేశారు. చికెన్ కు సబ్ స్ట్యూట్ గా మటన్, ఫిష్ కోసం జనం ఎగబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. పౌల్టీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమ కోళ్లను ఫామ్ హౌజ్ పక్కనే గుంత తీసి పూడ్చేస్తున్నారు. చికెన్ ప్రియులు రిజెక్ట్ చేయడంతో సప్లయ్ బాగా తగ్గింది. సప్లయ్ తక్కువైతే డిమాండ్ పెరుగుతుంది అనే ఎకనామిక్ ఫార్ములా తెలుగు రాష్ట్రాల్లో అమలవుతుంది. మటన్ ధరలు విపరీతంగా పెంచేశారు. జనాల్లో ఉన్న భయం ఎన్ క్యాష్ చేసుకునే పద్దతిని ఒంట బట్టించుకున్నారు. కొన్ని చోట్ల చికెన్ సెంటర్లను మూసేసి మటన్ షాపులు తెరచుకున్నాయి. తొలుత నష్టాలను చవి చూసిన చికెన్ షాపు ఓనర్లు ఇప్పుడిప్పుడే లాభాలు చూస్తున్నారు. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ క్యాంపెయిన్ నెగెటివ్ నుంచి పాజిటివ్ గా మారిపోయింది. అధికార , విపక్ష అనే తేడా లేకుండా ఒక్కటయ్యారు. ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి చికెన్ తినండి అని ఢంకా బజాయించి చెప్పేస్తున్నారు.
ఆల్ రిలేషన్స్ అన్నీ డబ్బుతో ముడిపడటమే దీనికి ప్రధాన కారణం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమలన్నీ అధికార, విపక్ష నేతలవే ఎక్కువగా ఉండటం కారణమని చెప్పుకోవచ్చు. నర్సాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్థానికంగా నిర్వహిస్తున్న చికెన్ మేళాలను ప్రమోట్ చేస్తుంటే సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇటీవలె చికెన్ మేళాలకు హాజరై 100 టెంపరేచర్ లో బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని చెబుతున్నారు. నేను రోజూ చికెన్ ముక్క లేనిదే ముద్ద గొంతులో దిగడం లేదని సిగ్గూ ఎగ్గూ లేకుండా చెప్పేస్తున్నారు. యాంటీ బర్డ్ ఫ్లూ క్యాంపెయిన్ కు ఈ మాజీ మంత్రి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. . బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న భయాన్ని, అపోహలను తొలగించేందుకు వివిధ ప్రాంతాల్లో చికెన్ మేళాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. వీటికి చికెన్ ప్రియులు ఎగ బెడుతున్నారు. చికెన్ వెరైటీ వంటకాలకు ఎగబడుతున్న జనం తెల్లారి చికెన్ షాపుల మోహం చూడటం లేదు. తాజాగా చికెన్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చికెన్ మేళాలకు చికెన్ ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చికెన్ వంటకాలను ఆస్వాదించడానికి నాన్ వెజ్ ప్రియులు బారులు తీరుతున్నారు.పుణ్యానికొచ్చిన చికెన్ తింటున్న జనం పైసలు పెట్టి కొనుగోలు చేయాలంటే బర్డ్ ఫ్లూ అని భయపడుతున్నారు. నార్మల్ డేస్ రావాలంటే మరికొంత సమయం పట్టొచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/i-like-chicken-for-virtue-i-fear-bird-flu-if-i-want-to-put-money-39-193757.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.