నేనలా అనలేదు బాబోయ్.. ఖర్గే మాట మార్చారా?

Publish Date:Apr 28, 2023

Advertisement

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆనక తీరిగ్గా నాలుక్కరుచుకున్నారు. కలబురగిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం  వేళ   మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీని విషసర్పంతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.   సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు. అలాంటి వ్యక్తి  మోడీని విష సర్పం అంటూ చేసిన వ్యాఖ్యలపై  కర్ణాటక  సీఎం బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు.  నరేంద్ర మోడీ..   దేశానికి ప్రధాని. ప్రపంచం మొత్తం ఆయనను గౌరవిస్తోంది. అలాంటి వ్యక్తిపై ఇలాంటి పదజాలం వాడడం సరికాదన్నారు. దీనికి బదులు కాంగ్రెస్ మునిగిపోయిందని చెప్పాల్సింది. మోడీపై చేసిన వ్యాఖ్యలకు ఖర్గే దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే డిమాండు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు ఈ స్థాయిలో రాజకీయ రచ్చకు కారణం కావడంపై.. ఖర్గే స్పందించారు.

తాను ప్రధాని మోడీని వ్యక్తిగతంగా ఏమీ అనలేదని.. తాను బీజేపీని అన్నానని వివరణ ఇచ్చారు. బీజేపీ భావజాలం గురించి చెబుతూ.. ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. ఆ భావజాలం విషం లాంటిదని.. మద్దతిస్తే మెడకు చుట్టుకుంటుందని తాను అన్నానని వివరించారు. నేనలా అనలేదు బాబోయ్ అంటూ ఖర్గే మొత్తుకుంటున్నారు.  ఖర్గే విష సర్ప వ్యాఖ్యలపై ముందు ముందు బీజేపీ ఇంకెంత తీవ్రంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.  

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.