గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాలను నేలకూలుస్తున్న హైడ్రా స్పీడ్ తగ్గించింది. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అనతికాలంలో ప్రజాభిమానాన్ని చూరగొంది. కాంగ్రెస్ కు బద్ద శత్రువైన బిజెపి కూడా హైడ్రా కూల్చివేతలకు సంఘీభావం తెలిపింది. పేద, బడుగు ప్రజల ఇళ్లను కూల్చొద్దని ఒక స్టేట్ మెంట్ తప్పితే పెద్దగా ప్రతిఘటించిన సందర్భం లేనే లేదు.
హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలను తొలగించే సాహసాన్ని ప్రజలు కీర్తించారు. మజ్లిస్ పార్టీకి చెందిన ఫాతిమా కాలేజి కూల్చివేతకు ‘హైడ్రా’ రంగం సిద్దం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రేవంత్ సర్కార్ వెనకడుగు వేసింది. ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉంటే కాలేజి యాజమాన్యాలే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ప్రస్తుతం కూల్చివేతలను హైడ్రా పూర్తిగా ఆపింది. ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను గుర్తించినప్పటికీ వాటిని తొలగించే పనిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునగడం వల్ల ప్రజల సహాయక చర్యల కోసం వేచి చూస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పడితే హైడ్రా పనులు పునరుద్దరణ జరుగుతాయి. ముంపు ప్రాంతాలను రంగనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ లలోని అక్రమ కట్టడాలకు ఇరిగేషన్, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. వారం రోజుల్లోగా ఇళ్లు ఖాళీ చేయాలని రంగనాథ్ హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hydra-brake-for-demolitions-25-184104.html
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.