వానాకాలంలో హైదరా ‘బాధలు’.. అధికారులకు రేవంత్ వార్నింగ్

Publish Date:Jun 15, 2026

Advertisement

హైదరాబాద్  ప్రజలు వర్షాకాంలో పడే బాధలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. విశ్వనగరం చినుకు పడతే చాలు విశ్వ నరకంగా మారిపోతోందన్న విమర్శలు ఇకపై వినిపించకూడదని అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ఇటీవలి భారీ వర్షం తరువాత  తలెత్తిన అస్తవ్యస్త పరిస్థితులపై ఆయన  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాన పడితే  జనజీవనం స్తంభించిపోవడం, రోడ్లన్నీ జలమయం కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ నెల  9 న నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా ప్రజలు ఎదుర్కొన్న  నరకయాతనను, ట్రాఫిక్ గందరగోళాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు.  వివిధ ప్రభుత్వ శాఖల మధ్య   సమన్వయలోపం వల్లే ఈ విపత్కర పరిస్థితులు తలెత్తాయన్న సీఎం రేవంత్ రెడ్డి..  ఇకపై వర్షాలు కురిసే సమయంలో ఏ ఒక్క అధికారి కూడా కార్యాలయాలకో, ఇళ్లకో పరిమితం కాకూడదనీ,  మున్సిపల్, పోలీస్, జలమండలి, విద్యుత్ శాఖల అధికారులు ఖచ్చితంగా రోడ్లపైనే ఉండి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలని విస్పష్టంగా చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే పూర్తి బాధ్యత అధికారులదేనన్న ఆయన.. నగర వాసులకు కనీస అసౌకర్యం కలిగినా సహించేది లేదనీ..  విధుల్లో అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ఇసుమంతైనా సహించబోననీ హెచ్చరించారు.    అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, ప్రజల రక్షణ కోసం తానే స్వయంగా రోడ్లపైకి వస్తానన్నారు.  సీఎం క్షేత్రస్థాయిలోకి వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దనీ..  అంతకంటే ముందే అధికారులు అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో నీరు నిలిచే ప్రాంతాలను  గుర్తించి, అక్కడ తక్షణమే డ్రైనేజీ క్లియరెన్స్ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ  అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ, శాఖల మధ్య నిరంతర సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు.  వర్షాకాలంలో భారీ వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

By
en-us Political News

  
భారత్ మరియు అఫ్గానిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం సరికొత్త మలుపు తిరిగింది.
నిరంజన్ ను చూసేందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ ఆతనితో చాలా సమయం గడిపారు. ఇంట్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా పలకరించారు. చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం అన్న నిరంజన్ మాటలకు పవన్ కదిలిపోయారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి, కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.
ర్యాగింగ్ సంఘటనకు సంబంధించి  ప్రభుత్వ డెంటల్ కాలేజీకి చెందిన 12 మంది ఫైనల్ ఇయర్ సీనియర్ విద్యార్థులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బాధితులు,  ప్రస్తుతం మొదటి సంవత్సరం  బీడీఎస్  చదువుతున్నారు. ప్రభుత్వ డెంటల్ కాలేజీ విద్యార్థులు నివసిస్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలోనే ఈ  ర్యాగింగ్ జరిగింది.
మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి సభ్యులుగా ఉన్న ఈ సబ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా వచ్చిన ప్రతిపాదనలను, నివేదికలను పరిశీలించింది. బుధవారం జరిగే భేటీలో అధికారుల అభిప్రాయాలను సేకరించి, భవనాల వాడకంపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం.. వచ్చే కేబినెట్ మీటింగ్‌లోనే కమిటీ నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. పార్క్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కను నాటారు. అనంతరం పార్క్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు. సెల్ఫీలు తీసుకున్నారు.
తాడేపల్లి ప్రాతూరు రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో రెండు దశలుగా చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం 11 వందల 67.50 కోట్ల రూపాయలు కాగా, మొదటి దశ పనులకు.604.32 కోట్లు, రెండూ దశ పనులకు 563.18 కోట్ల రూపాయలు కేటాయించారు.
దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాలలో వాతావరణం రోహిణీకార్తెను తలపిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ సమయానికి తెలంగాణలో సాధారణంగా 63 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ కేవలం 51 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే రమారమి 20 శాతం లోటు నమోదైంది.
ఫేజ్‌ 1 స్వాధీనం ప్రక్రియలో ఈక్విటీ కొనుగోలుకు రూ. 1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు 13 వేల 538.53 కోట్లు కలిపి మొత్తం 15 వేల కోట్ల లావాదేవీలున్నాయి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పారదర్శకంగా నిర్వహించింది. ఈ కమిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున యూపీఎంఆర్‌సీఎల్‌ ఎండీ సుశీల్‌కుమార్‌ను సభ్యుడిగా నామినేట్‌ చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో నష్టాలు వచ్చినా ఐటీఆర్ (ITR) ఎందుకు దాఖలు చేయాలో తెలుసుకోండి. క్యారీ ఫార్వర్డ్ రూల్స్, ఐటీఆర్-2 ఫామ్ మరియు పన్ను ఆదా చేసుకునే విధానం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. భారత స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డుల వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ టార్గెట్ 29,000 గా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ర్యాలీలో ఇన్వెస్టర్లు లబ్ధి పొందడానికి L&T, టాటా మోటార్స్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో కూడిన బెస్ట్ మార్కెట్ స్ట్రాటజీ మరియు స్టాక్స్ వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 లో ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుపై అమెరికా విధించిన ఆంక్షలు, వీసా వివాదం మరియు రాత్రికి రాత్రే దేశం విడిచి వెళ్లాలన్న ఆదేశాల వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఇండియా ఎ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ డకౌట్ వివాదం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న వివాదాస్పద నాటౌట్ నిర్ణయంపై ఇరు జట్ల అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
రైలు టికెట్ రద్దుపై కేవలం రూ.5 తక్కువ రీఫండ్ ఇచ్చినందుకు భారతీయ రైల్వే శాఖకు వినియోగదారుల కోర్టు రూ.10,000 భారీ జరిమానా విధించింది. సామాన్య ప్రయాణికుడి విజయం వెనుక ఉన్న పూర్తి వివరాలు మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.