Publish Date:Nov 27, 2013
హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారని, హైదరాబాద్ యు.టి. ప్రతిపాదనకి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని విభజనవాదులు విరుచుకుపడుతున్నారు. యు.టి. పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ఇంతకీ విభజనవాదులు యు.టి.ని ఎందుకు వద్దంటున్నారంటే...
1. హైదరాబాద్ మాదే అని పోజులు కొట్టడానికి వీలుండదు.
2. హైదరాబాద్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో వుంటుంది కాబట్టి లోకల్ రాజకీయ నాయకుల ఆటలు చెల్లవు.
3. హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు న్యాయమైన వాటా దక్కుతుంది.
4. స్థానికంగా వుండే రాజకీయ నాయకులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలి. హైదరాబాద్‌ని ఉద్ధరించేస్తామని చెబుతున్నవాళ్ళకి ఆ ఛాన్స్ వుండదు.
5. సీమాంధ్రులను హింసించడానికి వీలుండదు. భయభ్రాంతులను చేయడానికి అవకాశం వుండదు. వాళ్ళని హైదరాబాద్ నుంచి తరిమేస్తాం అనడానికి కూడా ఛాన్స్ వుండదు.
6. పదేళ్ళ తర్వాత యు.టి. శాశ్వతంగా కంటిన్యూ అయ్యే అవకాశం వుంది.
7. హైదరాబాద్‌లో సీమాంధ్రుల ఆస్తులపై దాడులు చేయడానికి వీలుండదు.
8. సీమాంధ్రులను హింసించడానికి కొత్తకొత్త చట్టాలు క్రియేట్ చేయడానికి అవకాశం లేదు.
9. హైదరాబాద్‌లో విద్య, ఉద్యోగాల విషయంలో సీమాంధ్రులను అనాథలు చేసే అవకాశం వుండదు. ఈ విషయంలో సీమాంధ్రులు, తెలంగాణవాళ్ళు అనే తేడా వుండదు. అందరూ సమానమే.
10. యు.టి. అయితే కబ్జాలు కుదరవు. కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు తప్పనిసరిగా చెల్లించాలి.
11. యు.టి.కి ఒప్పుకుంటే తెలంగాణ విభజనకు అడ్డంకులు వుండవు. తెలంగాణ సమస్య పరిష్కారమైపోతుంది. విభజనులకు, ఉద్యమాలు చేసేవాళ్ళకు పని వుండదు.
.... ఇవి కాక ఇలాంటి నష్టాలు ఇంకా బోలెడన్ని వున్నాయి. అందుకే యు.టి. వద్దంటారు!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-union-territory-39-27830.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.