రాజమండ్రి ఘటన మరువక ముందే.. నార్సింగిలో మరో ఘటన..!

Publish Date:Aug 10, 2026

Advertisement

 

రాజమండ్రి ఘటన మరువక ముందే.. నార్సింగిలో మరో ఘటన..!

హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు నిబంధనలను ఉల్లంఘించి, మద్యం మత్తులో వాహనాన్ని అత్యంత వేగంగా నడిపిన ఆకతాయిలు ఆర్మీ జవాన్ ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదర్‌షాకోట్ ప్రధాన రహదారిపై శంషాబాద్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ మహీంద్రా ఎస్‌యూవీ కారు తీవ్ర వేగంతో రాంగ్ రూట్‌లోకి దూసుకొచ్చింది. అదే సమయంలో రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి సదరు కారు అనియంత్రితంగా దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో హైదర్‌షాకోట్‌కు చెందిన  ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. కారు గట్టిగా ఢీకొట్టడంతో ఆయన గాలిలోకి ఎగిరి పడటంతో తలకు తీవ్ర రక్తగాయమై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దేశ రక్షణలో సుదీర్ఘ కాలం సేవలు అందించిన విశ్రాంత జవాన్ ఇలా దారుణంగా మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

బాధితుడిని ఢీకొట్టిన అనంతరం సదరు కారు ఆగకుండా ముందుకు వెళ్తూ ఒక రాపిడో బైక్‌తో పాటు మరో ఇద్దరు పాదచారులను గుద్దింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరికి కాలు విరగ్గా, మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఐదుగురు యువకులు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. పారిపోయే సమయంలో వాహనంలో ఉన్న మద్యం సీసాలను కూడా వెంట తీసుకెళ్లినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. నిందితులు తీవ్రంగా మద్యం సేవించి ఒళ్లు తెలియని స్థితిలో రాంగ్ రూట్‌లో వాహనాన్ని నడిపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఇటీవల కాలంలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు వరుసగా వెలుగుచూడటంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన డ్రైవింగ్ చేస్తూ ఇతర కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపే ఇటువంటి బాధ్యతారాహిత్య ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, శంషాబాద్ రిజిస్ట్రేషన్ ఆధారంగా వాహన యజమానిని, నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

కేసును వేగవంతంగా విచారించి, పరారీలో ఉన్న ఐదుగురు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. బాధ్యులపై కఠినమైన చట్టపరమైన సెక్షన్ల కింద చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని స్థానిక ప్రజలు, ఆర్మీ సంక్షేమ సంఘాలు కోరుతున్నాయి.

రాజమండ్రి ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరిగింది. ఈసారి  ఆర్మీ జవాన్ మృతి చెందారు. ఇంకో వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇలా మద్యం మత్తులో కొందరు వ్యక్తులు చేస్తున్న తప్పులు వేరే కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపుతున్నాయి. ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. 

Hyderabad Road Accident, Narsingi SUV Crash, Retired Army Employee Death, Hyder Shah Kote, Mahindra SUV Accident, Narsingi Polic, CM Revanth reddy, DGP C.V. Anand, CP Sajjanar 

By
en-us Political News

  
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే విషయంపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మ్యాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ ఏజ్, ఫిట్‌నెస్, రికార్డులతో కూడిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి!
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇ ఇదిలా ఉండగా, విమానాశ్రయా నికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆగస్టు 15 నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల సేవలను కూడా ప్రారంభిం చనున్నారు.  
ఇటీవలే   బిడ్డకు జన్మనిచ్చిన కరోలిన్ లెవిట్..  తన పిల్లలు కుటుంబ సభ్యులతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి వైదొలగాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది.  గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో  ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు   అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు.  
మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు,  ఉత్తర్వులు ఇవ్వలేదనీ,   తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు. 
అమెరికా సైనిక సామర్థ్యాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం దక్కిందన్న ఆయన తాము ఊహించిన దాని కంటే.. అమెరికా సైన్యం చాలా బలహీనంగా ఉందన్నారు.
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.