గవర్నర్‌ చేతికి హైదరాబాద్?

Publish Date:Jun 10, 2015

Advertisement



ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలు గవర్నర్ నరసింహన్‌కి అప్పగించడానికి పావులు కదులుతున్నట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు కేంద్రం నుంచి వెలువడే అవకాశం వుందని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. అలాగే పలువురు ఉన్నతాధికారులను ఆయన కలిశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అలాగే ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బుధవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో, హోంశాఖ కార్యదర్శితో కూడా భేటీ అయ్యారు. చకచకా, చాలా సీరియస్‌గా జరుగుతున్న ఈ భేటీలను చూస్తుంటే త్వరలో హైదరాబాద్‌ శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను గవర్నర్ నరసింహన్ చేతిలో పెట్టే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతల బాధ్యతను పదేళ్ళపాటు ఉమ్మడి గవర్నర్ నిర్వహించాలని విభజన చట్టంలో వుంది. రాష్ట్ర విభజన చట్టంలోని 8 ప్రకారం  ఉమ్మడి రాజధాని శాంతిభద్రతల బాధ్యత గవర్నర్‌‌దే. విభజన చట్టంలో  వున్న అనేక అపరిష్కృత అంశాలలో ఈ అంశం కూడా ఒకటి. రాష్ట్ర విభజన జరిగి ఒక సంవత్సరం దాటినప్పటికీ ఈ అంశంలో కేంద్రం, గవర్నర్ ఇంతవరకు ఎలాంటి చొరవ చూపిన దాఖలాలు కనిపించలేదు. అయితే రేవంత్ రెడ్డి వ్యవహారం, చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు చెబుతున్న ఫోన్ సంభాషణల ఉదంతం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేతిలోనే పోలీసు వ్యవస్థ వుండటం వల్ల ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా జరుగుతున్నాయని, కేసీఆర్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తన చేతిలో పెట్టుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఢిల్లీలో జరిగిన పరిణామాలు గవర్నర్ చేతికి హైదరాబాద్‌ శాంతిభద్రతలు అందబోతున్నాయన్న సూచనలను ఇస్తున్నాయి.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.