ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర ముఠా అరెస్ట్

Publish Date:Jan 3, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో ఏటీఎంల వద్ద కేవలం చదువురాని, వృద్ధులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వారి దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.52,000 నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 89 ఏటీఎం కార్డులు, మూడు సెల్‌ఫోన్లు మరియు ఒక ఆటో రిక్షాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన నిందితులు

హర్యానాకు చెందిన అమీర్ సుహెల్ @ అమీర్ సోహైల్ @ సోహెల్ (24), ముబారిక్ (26), ముస్తకీమ్ (25)తో పాటు హైదరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అమేర్ (33)ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అమీర్ సుహెల్, ముబారిక్‌లు ప్రధాన నిందితులుగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే....

డిసెంబర్ 31న ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ అలకుంట వెంకటేష్ (38) ఫిర్యాదు మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అలకుంట వెంకటేష్ తన తల్లి ఏటీఎం కార్డులో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబర్ 28న మల్లేపల్లి ఎక్స్‌రోడ్స్‌లోని ఎస్‌బీఐ ఏటీఎ వెళ్లాడు. కానీ ఇతనికి చదువు రాకపోవడంతో అక్కడున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల సహాయం కోరాడు. వారు అతని తల్లి ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని, అందులో 1,32,000 ఉన్నట్లుగా చెప్పారు. అనంతరం నిందితులు కార్డు మార్చిఅలకుంట వెంకటేష్ కు ఇచ్చారు. 

కార్డు తీసుకుని వెంకటేష్ వెళ్లిన అనంతరం నిందితులు అసలైన కార్డుతో రూ.40,000 నగదు విత్‌డ్రా చేశారు. అనంతరం వెంకటేష్ తన తల్లి ఫోన్ కు బ్యాంకు నుండి వచ్చిన ఎస్ఎంఎస్ చూసి ఒక్కసారిగా అవాక్క య్యాడు. ఏటీఎం కార్డు తను వద్ద ఉండగా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి అని బాగా ఆలోచించిన వెంకటేష్ కు ఏటీఎం కార్డు వద్ద నిందితులే తనను మోసం చేశారని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించగా ఈ ముఠా వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది...ఈరోజు జనవరి 3 ఉదయం విజయ్‌నగర్ కాలనీలోని ఏటీఎం వద్ద మరో నేరానికి ప్రయత్నిస్తున్న సమయంలో సమాచారం అందుకున్న మెహిదీపట్నం క్రైమ్ సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. విచారణలో వారు ఏటీఎం నేరాలకు పాల్పడుతున్నట్లుగా అంగీకరించారు.

ప్రధాన నిందితుడు అమీర్ సుహెల్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదై ఉండగా, రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు ముబారిక్ హర్యానాలో ఆటోమొబైల్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది.చదువురాని వారు లేదా వృద్ధులు ఏటీఎంల వద్ద డబ్బులు విత్‌డ్రా చేయడం లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకునే సమయంలో సహాయం చేస్తామని నమ్మించి, పిన్ నంబర్ తెలుసుకుని, కార్డులను మారుస్తూ ఖాతాల నుంచి డబ్బు కొల్లగొట్టడమే ఈ ముఠా ప్రధాన పద్ధతిగా పోలీసులు వెల్లడించారు. 

నిందితులను అరెస్టు చేసి మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 365/2025 కింద సెక్షన్లు 318(4), 303(2) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రజలకు పోలీసుల సూచన ఏటీఎం కార్డును ఎవరికీ ఇవ్వవద్దని, పిన్ నంబర్‌ను  ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు చెప్పవద్దని పోలీసులు సూచించారు. అవసరమైతే బ్యాంక్ సిబ్బంది సహాయం మాత్రమే తీసుకోవాలని హెచ్చరించారు.

By
en-us Political News

  
ఎన్‌ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్‌ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దళపతి విజయ్ కు ఈ సంక్రాంతి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు.
భీమవరం, అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఆడే కోడి పందేలు కడపజిల్లా లోను కోత లేస్తున్నాయి.
మహారాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓటింగ్‌ కొనసాగుతోంది.
కేరళలోని కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో విషాదం నెలకొంది.
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ రికార్డులకెక్కాడు.
నారావారిపల్లిలో గ్రామ దేవత నాగాలమ్మకు సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.
హైదరాబాద్‌లో ట్రేడింగ్ పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గోవులకు మేత తినిపించి ప్రధాని మోదీ భక్తిని చాటుకున్నారు.
నారావారి పల్లెలో జ‌రిపే సంక్రాంతి వేడుక‌ల్లో నారా, నంద‌మూరి కుటుంబసభ్యులందరూ క‌ల‌సి పాల్గొంటారు. దీంతో ఈ ఊరు క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. ఊరు ఊరంతా జాత‌రలాంటి వాతావ‌ర‌ణం ఏర్పడుతుంది. సంక్రాంతి సందర్భంగా ఒకే సారి నారా వారి కుటుంబానికి చెందిన మూడు త‌రాల‌ వారిని చూసి నారావారి పల్లె పులకించి పోతుంది.
ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తజనం స్వామియే శరణం అయ్యప్ప అంటూ తన్మయత్వంలో మునిగిపోయారు.
ప్రభుత్వం ఈ బకాయిలను సరిగ్గా భోగి పండుగ రోజున విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలలో సంక్రాంతి సంతోషం రెట్టింపైంది. దాదాపు ఆరేళ్ల తరువాత ఈ బకాయిలు విడుదలయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.