Publish Date:Oct 16, 2021
భారత దేశం అంటే హిందూ దేశంగా భావిస్తారు. అయితే కొన్ని రోజులుగా దేశంలో ఓ ప్రచారం సాగుతోంది. దేశంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుందని.. ఇది ఇలాగే కొనసాగితే మరో ముప్పే ఏండ్లలో భారత దేశంలో హిందువుల కంటే ముస్లిం జనాభే ఎక్కువ అవుతుందనే చర్చ జరుగుతోంది.ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్ తో పాటు పలు హిందూ సంఘాలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. విజయదశమి సందర్భంగా చేసిన ప్రసంగంలో మోహన్ భగవత్ మరోసారి ఇదే అంశంపై మాట్లాడారు.
దేశంలో ముస్లిం, క్రిస్టియన్ జనాభా పెరిగిపోతుందని చెప్పారు మోహన్ భగవత్. జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావాలన్నారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించాలని సూచించారు. ఇది అందరికీ సమానంగా వర్తింపచేయాలని.. జనాభా అసమతౌల్యత పెద్ద సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ లో ప్రజలను భయపెట్టడం కోసం ఉగ్రవాదులు హింసను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ తాలిబన్ ఉగ్రవాదం నుంచి జనాభా నియంత్రణ వరకు పలు అంశాలపై మోహన్ భగవత్ మాట్లాడారు.
జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. మోహన్ భగవత్ విజయదశమి ప్రసంగం అబద్దాలు సగం సత్యాలతో నిండి ఉందని ఓవైసీ ఆరోపించారు. జనాభా నియంత్రణ విధానం ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలపై భగవత్ చేసిన కామెంట్లను ఖండించారు అసద్. ముస్లింలు క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని ఆయన పునరావృతం చేశారని చెప్పారు. కాని దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉందని ఒవైసీ చెప్పారు. బాల్య వివాహాలు సెక్స్ సెలక్టివ్ అబార్షన్ ల వంటి సామాజిక దూరాచారాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ లో ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారని భగవత్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఈ ఏడాది జరిగిన పౌరహత్యలను ఒవైసీ ప్రస్తావించారు. హత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించినఅసద్.. దీనివల్ల ఇంటర్నెట్ షట్ డౌన్ లు సామూహిక నిర్బంధాలతో కశ్మీర్ ఒక రావణకాష్టంలా మారిందని విమర్శించారు. సగం నిజం సగం అబద్దం చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగపడడం ఉండదని ఓవైసీ విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-mp-asad-counter-to-rss-chief-mohan-bhagavath-over-population-issue-25-124625.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.