Publish Date:Apr 19, 2025
రాష్ట్రంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక వేడి రాజుకుంది. ఎన్నికల బరిలో ప్రధానంగా బీజేపీ, ఎంఐఎం ఉన్నాయి. ఈ ఎలక్షన్‌లో మజ్లిస్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వనుట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎవరికీ ఓటు వేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌కు పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కావడం కోసం కమలం పార్టీ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు గులాబీ పార్టీ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విప్ జారీ చేస్తామని హెచ్చరించారు. పార్టీ విప్ ధిక్కరిస్తే వేటు తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ వద్దు ఎంఐఎం వద్దని ఇరు పార్టీలకు సమదూరం పాటించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈనెల 24వ తేదీన ఎమ్మెల్సీ ఓటింగ్‌కు అందరూ దూరంగా ఉండాలని పార్టీ నేతలకు కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరావును ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు కాంగ్రెస్ ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎవరికీ ఓటు వేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
బీజేపీకి గెలిచే అంతా బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎవరికీ మద్దతిస్తాయనేది చూసిన తర్వాత కమలం పార్టీ ఓ నయా ప్లాన్ రూపొందించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అంటే ,హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 113 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 113 ఓట్లలో 49 ఓట్లతో ఎంఐఎంకు, తిరుగులేని ఆధిక్యత వుంది. బీఆర్ఎస్‌కు 25, బీజేపీకి 22, కాంగ్రెస్‌కు 14 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి కాలం, త్వరలో ముగియనుండడంతో జరుగతున్న, ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి, మీర్జా రియాజ్ ఉల్ హసన్ గెలుపుకు ముందు గానే ఖారారైనట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్‌పై కాషాయ పార్టీ హోప్స్ పెట్టుకుంది. బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అధైర్యంతోనే బీజేపీ సంఖ్యా బలం లేక పోయినా తమ అభ్యర్ధిని బరిలో దించిందని ఆరోపిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-mlc-election-25-196556.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.