హైదరాబాద్ మెట్రో రైల్.. ట్రయాంగ్యులర్ పొలిటికల్ వార్!

Publish Date:Jun 17, 2026

Advertisement

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణలో ముక్కోణపు రాజకీయ పోరుకు తెరలేపింది.  నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ మెట్రో ప్రాజెక్ట్   ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ట్రయాంగ్యులర్ పోరుకు వేదిక అయ్యింది.  కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది.  ఈ పార్టీల మథ్య  వాడివేడి చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యామ్నాయాలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది.  

బిఆర్ఎస్ ప్రభుత్వంపై, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బిఆర్ఎస్ పాలకులు ప్రజల అవసరాలను, ప్రజా డిమాండ్‌ను పూర్తిగా పక్కనబెట్టేశార  ఆరోపించారు. కేవలం తమ   ప్రయోజనాలు, ఆర్థిక లాభాల కోసమే ఈ ప్రాజెక్టును వాడుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు అత్యంత కీలకమైన, ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో మెట్రో లైన్లను కేటాయించకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పాడు చేసిందన్నారు. అక్కడితో ఆగకుండా  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా  మెట్రో ప్రాజెక్టు అభివృద్ధికి సహకారం అందించడం లేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఈ ప్రాజెక్టుకు రుణం అందకుండా అడ్డుకుంటున్నారనీ దుయ్యబట్టారు.  

ఈ విమర్శలపై  బిఆర్ఎస్ నాయకత్వం  ఘాటుగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   కొత్తగా అదనపు మెట్రో లైన్లను సాధించడంలో   పూర్తిగా విఫలమయ్యారని ఎదురుదాడికి దిగింది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి  తమపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడింది.   ప్రాజెక్టును ప్రారంభించిన బిఆర్ఎస్ పాలనను విమర్శించడం మానేసి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ హైదరాబాద్ నగరానికి కొత్త మెట్రో రూట్లను తీసుకురావడంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని హితవు పలికింది. 

ఇక బీజేపీ కూడా రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసింది.  రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారనీ..  ఇప్పుడు వాటిని నెరవేర్చలేక చేతులెత్తేస్తున్నారని మండిపడింది.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అబద్ధపు ఆరోపణలు చేస్తూ, తన వైఫల్యాలను బిజెపిపైకి నెట్టేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్న బిజెపి..  ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే మేధోశక్తి, కార్యాచరణ రేవంత్ రెడ్డికి లేవని విమర్శించింది. మొత్తానికి ప్రజారవాణాకు అత్యంత కీలకమైన  హైదరాబాద్ మెట్రో  ఇప్పుడు పొలిటికల్ ట్రయాంగిల్ ఫైట్ కే కేంద్ర బిందువుగా మారింది. 

By
en-us Political News

  
దెందులూరు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది..
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం
కాక్రోచ్ పార్టీ కేవలం ఒక నిరసన వేదికగా కాకుండా, కాక్రోచ్ జనతా పార్టీగా రూపాంతరం చెందుతూ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది.
మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి మోహన రావు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
కూటమి రెండేళ్ల పాలనపై ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు.
గత ఎన్నికల్లో దూరమైన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడానికి వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర లేపుతోంది.
రాజకీయ ముసుగు వేసుకుని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వికృత ధోరణిని తాము సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే ముందు, తమ ఇళ్లలో కూడా మహిళలు, తల్లులు, చెల్లెళ్లు ఉన్నారనే కనీస విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.
తన రాజీనామాను ఆయన శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను స్వయంగా కలిసి అందజేశారు. ఆ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు.
ఢిల్లీలో ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్‌ షిండే అధికారిక నివాసంలో రహస్యంగా సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సమావేశంలో విలీన వ్యూహాన్ని ఖరారు చేసుకున్న అనంతరం.. వీరంతా కలిసి, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ వర్తమాన రాజకీయ పరిణామాలపై లోతైన విశ్లేషణను అందిస్తూ సాగిన వాస్తవ వేదిక చర్చా..
ఆంధ్రప్రదేశ్ ఖనిజ మరియు గనుల సంపదకు సంబంధించిన తాజా రాజకీయ, ఆర్థిక పరిణామాలను విశ్లేషిస్తూ, మీ రిక్వెస్ట్ మేరకు రూపొందించిన ప్రత్యేక వ్యాసం కింద ఇవ్వబడింది.
మెటా సంస్థ కేవలం ఒకరి ఫిర్యాదుతో ఓవర్ నైట్ ఏ అకౌంట్‌ను సస్పెండ్ చేయదని ఆయన చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పదే పదే ఉల్లంఘించడం వల్లే ఈ బ్లాక్ జరిగిందని వివరించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 15,941 మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయనీ.. అయితే వైసీపీ నేతలు తప్పుడు ఆధారాలు, ఫేక్ ఆడియో క్లిప్పింగులతో సమాజంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారని అప్పసాని రాజేష్ ఆరోపించారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజక వర్గాల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర పెంచి, మొత్తం 815 స్థానాలకు చేర్చాలనేది ప్రాథమిక ప్రతిపాదన. అయితే.. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహా మండలి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక నివేదికను సిద్ధం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.