అమ్మాయి పేరుతో వల.. నగ్న ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌.!

Publish Date:Oct 19, 2026

Advertisement

1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!

సోషల్‌ మీడియాలో అమ్మాయి పేరుతో పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. ఆపై వ్యక్తిగత ఫొటోల సేకరణ.. చివరకు పోలీస్‌ కేసుల పేరుతో బెదిరింపులు! ఇలా హనీట్రాప్‌, సైబర్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన యువకుడిని సైదాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 1,000 మందికి పైగా వ్యక్తులతో చాటింగ్‌ చేసినట్లు, వారిలో 82 మంది తమ నగ్న ఫొటోలు, వీడియోలు పంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మొత్తం రూ.25.16 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఫేక్‌ ఐడీలతో పరిచయం.. ప్రైవేట్‌ ఫొటోలతో వల.!.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొండభత్తుల పవన్‌ కుమార్‌ (23) అనే యువకుడు హైదరాబాద్ బాలానగర్ లోని సిఐటీడీ లో డిప్లమా కోర్సును మధ్యలోనే ఆపేశాడు... మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతున్నట్లుగా తల్లిదండ్రులను నమ్మించాడు.. అనంతరం బషీర్బాగ్లో స్టార్ పవర్ డిజి లోన్స్ ప్రవేట్ కంపెనీలో రెండు నెలలు ఆ తర్వాత నాన్నకు రామగుడాలోని కపిల్ చిట్ ఫండ్స్ లో మూడు నెలలు పని చేశాడు ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయకుండా.. సోషల్ మీడియా వేదికగా చేసుకొని సైబర్ మోసాలకు పాల్పడుతూ పలువురు వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు.

ఓ ఫిర్యాదు దారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పవన్ కుమార్ ఆట కట్టించారు.. నిందితుడు పవన్...అమ్మాయిల పేర్లతో నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు సృష్టించి పలువురికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపేవాడు. అవతలి వ్యక్తులతో అమ్మాయిలా మాట్లాడుతూ పరిచయం పెంచుకుని, క్రమంగా లైంగిక సంభాషణల వైపు మళ్లించేవాడు. అనంతరం ఇతరుల నగ్న చిత్రాలను పంపిస్తూ, బాధితుల నుంచి కూడా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించేవాడని పోలీసులు తెలిపారు.

‘అన్నయ్య’ ఎంట్రీతో అసలు కథ.!

బాధితుల నుంచి ఫొటోలు, వీడియోలు సేకరించిన తర్వాత కథలో మరో పాత్ర రంగ ప్రవేశం చేసేది... చాటింగ్‌ చేస్తున్న అమ్మాయికి తానే అన్నయ్యనంటూ నిందితుడు పవన్‌ బాధితులను సంప్రదించేవాడు. ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌, సోషల్‌ మీడియా ద్వారా వారిని బెదిరిస్తూ.. తన చెల్లెలితో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయిస్తానని భయపెట్టే వాడు. కొందరిని వ్యక్తిగతంగా కూడా కలుసుకుని డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఒక్కొక్కరికి ఒక్కో వల.. లక్షల్లో వసూళ్లు.!.

ఈ కేసులో వెలుగులోకి వచ్చిన వివరాలు మరింత విస్తుపోయేలా ఉన్నాయి. నిందితుడి స్నేహితుడొకరు కూడా ఇదే హనీట్రాప్‌లో చిక్కుకోగా, అతడి నుంచి రూ.4 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెట్టుబడులపై అధిక లాభాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి రూ.7 లక్షలు మోసం చేసినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరి నుంచి వరుసగా రూ.6.8 లక్షలు, రూ.7 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీటికి సంబంధించి మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

27 సోషల్‌ మీడియా ఖాతాలు.. మూడు మొబైల్‌ ఫోన్లు.!.

నిందితుడు ఉపయోగించినట్లు గుర్తించిన నకిలీ ఖాతాల్లో 13 ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలు, 14 ఫేస్‌బుక్‌ ఐడీలు ఉన్నాయి. మూడు మొబైల్‌ నంబర్లు, రెండు వాట్సాప్‌ ఖాతాలను కూడా ఉపయోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నకిలీ ఖాతాల్లో కోల్‌కతాకు చెందిన ‘చందన’ అనే యువతి ఫొటోలను ఎక్కువగా వినియోగించినట్లు గుర్తించి, ఆమెను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ బాధితులు.!.

ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన 24 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దుబాయ్‌, టర్కీ, పాకిస్తాన్‌, కెనడాకు చెందిన మరో తొమ్మిది మంది బాధితుల వివరాలు కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వైద్యులు, వ్యాపారవేత్తలు, లెక్చరర్లు, ప్రైవేట్‌ ఉద్యోగులు, డెలివరీ సిబ్బంది, గిగ్‌ డ్రైవర్లు తదితరులు ఈ వలలో చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల లెక్కల ప్రకారం, బెదిరించి వసూలు చేసిన మొత్తం రూ.18 లక్షలు కాగా, మోసం చేసి కాజేసిన మొత్తం రూ.7.16 లక్షలు. మొత్తంగా రూ.25.16 లక్షల మేర వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 

సైదాబాద్ పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 308(7), 351(2), ఐటీ యాక్ట్‌ సెక్షన్లు 66C, 66D, 66E, 67A ప్రకారం కేసు నమోదు చేసి... అరెస్టు చేసి...నిందితుడి నుంచి రెడ్‌మి, వివో వై29, శామ్‌సంగ్‌ గెలాక్సీ మొబైల్‌ ఫోన్లు, హెచ్‌పీ ల్యాప్‌టాప్‌, 16 జీబీ పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని బాధితులు ఉన్నారా? ఇతర కేసులతో సంబంధాలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పోలీసుల సూచనలు సోషల్‌ మీడియాలో పరిచయమైన అపరిచితులకు వ్యక్తిగత లేదా నగ్న ఫొటోలు, వీడియోలు పంపవద్దు. ఇలాంటి చిత్రాలతో ఎవరైనా బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేస్తే భయపడి చెల్లించకుండా, ఆధారాలను భద్రపరచి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సైబర్‌ ఆర్థిక మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్‌ చేయాలి లేదా జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు..

 

 

 

[ Hyderabad honey trap, cyber crime arrest, fake social media accounts, blackmail extortion, Saidabad police, online scams, Pavan, CM Revanth reddy, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand ]

By
en-us Political News

  
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.