మినరల్ వాటర్ తో ముంచుకొస్తున్న ప్రమాదం

Publish Date:Mar 12, 2012

Advertisement

హైదరాబాద్: రాష్ట్రంలో మినరల్ వాటర్ పేరుతో మంచినీటి వ్యాపారం చేస్తున్న ప్లాంట్ యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్యాకింగ్ చేసి విక్రయించే నీటికి తప్పనిసరిగా ఐఎస్ ఐ  సర్టిఫికెట్ ఉండాలి. కాని ఇటువంటి సర్టిఫికెట్లు లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా వందలాది మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టుకొచ్చాయి. ఈ ప్లాంట్లు అపరిశుభ్రమైన నీటిని విక్రయించి ప్రజల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయి. ఇటీవల ఒక మినరల్ వాటర్ ప్లాంట్ సరఫరా చేసిన వాటర్ క్యాన్ లో చచ్చిన  ఎలకపిల్ల కనిపించింది. నిత్యం ఎక్కడో ఒకచోట ఇటువంటి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

 

రాష్ట్రంలో ఐఎస్ ఐ సర్టిఫికెట్లతో కేవలం 300 ప్లాంట్లు మాత్రమే నడుస్తుండగా ఐఎస్ ఐ సర్టిఫికెట్లు, ఐఎస్ ఓ సర్టిఫికెట్లు లేకుండా 5000 వాటర్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. వేసవిలో వీటి సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ అనధికార ప్లాంట్ల మధ్య పోటీ ఏర్పడి కొన్నిచోట్ల 20 లీటర్ల నీటిని మూడు లేదా నాలుగు రూపాయలకు కూడా విక్రయిస్తున్నారు. ఈ నీటివల్ల అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి మినరల్ వాటర్ ప్లాంట్ మంచినీరు లభ్యమయ్యే సొంత బోరును తవ్వించుకోవాలి.

 

ఈ బోరులు తవ్వడానికి ప్రభుత్వ అనుమతి తప్పని సరి. ఈ ప్లాంట్లు తప్పనిసరిగా ఐఎస్ఐ సర్టిఫికెట్లు పొందాలి ప్రతి ప్లాంట్ లో రోజుకు నాలుగుసార్లు నీటిని పరీక్షించడానికి ప్రత్యేక ల్యాబ్ ఉండాలి. నిత్యం పరీక్షించే నీటి వివరాలను రికార్డుల్లో నమోదుచేయాలి. ఐఎస్ఐ గుర్తింపు రావాలంటే ప్లాంట్ల నిర్వాహకులు 35 రకాల సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ గోలంతా పట్టని చిన్నచిన్న ప్లాంట్ల యజమానులు అవేమీ లేకుండానే శుద్దిచేయని నీటినే బహిరంగంగా విక్రయిన్చేస్తున్నారు. మినరల్ వాటర్ అనే పేరుకు బదులుగా సుద్దిచేసిన త్రాగునీరు అనే పదాన్ని ఉపయోగించి లూజుగా మంచినీళ్ళను విక్రయిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్నన్ని ప్లాంట్లు దేశంలో ఎక్కడా లేవని ఒక అధికారి వ్యాఖ్యానించడం విశేషం. ఈ ప్లాంట్లు వాడుతున్న ప్లాస్టిక్ క్యాన్లు, ప్యాకెట్లు కూడా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ కాదని, ఇటువంటి మెటీరియల్ ను వాడటం వల్ల రక్తహీనత, నరాలు, శ్వాసకోశ, జీర్ణాశయ సంబంధిత వ్యాధులు రావచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. 

By
en-us Political News

  
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.