Publish Date:Oct 22, 2019
తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన హుజూర్‌నగర్ ఉపఎన్నికలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌దే విజయమని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. హుజూర్‌నగర్‌లో ఈసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెబుతున్నాయి. హుజూర్‌నగర్ బైపోల్‌పై ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించిన మిషన్ చాణక్య సంస్థ... కచ్చితంగా కారుదే గెలుపు అంటూ బల్లగుద్దిమరీ చెబుతోంది. టీఆర్‌ఎస్‌కి 53శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, కాంగ్రెస్‌కు 41శాతం ఓట్లు, తెలుగుదేశానికి 2.1శాతం ఓట్లు వస్తాయని చెబుతోంది. అయితే, టీఆర్‌ఎస్ కి తామే ప్రత్యామ్నాయమంటూ బరిలోకి దిగిన బీజేపీకి కేవలం 1.1శాతం ఓట్లు మాత్రమే వస్తాయని మిషన్ చాణక్య సంస్థ అంచనా వేసింది.హుజూర్‌నగర్ నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర్నుంచి ఇప్పటివరకు వరకు మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్‌కు ఈసారి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. టీపీసీసీ చీఫ్ కంచుకోటైన హుజూర్‌నగర్‌లో ఈసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమంటోంది. 50శాతానికి పైగా ఓట్ షేర్‌తో కారు దూసుకుపోతుందని మిషన్ చాణక్య సంస్థ చెబుతోంది. అంతేకాదు టీఆర్ఎస్ కి 18వేల నుంచి 25వేల వరకు మెజారిటీ వస్తుందని అంచనా వేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కంటే కేసీఆర్ సంక్షేమ పథకాలే ఎక్కువగా ఓటర్లపై ప్రభావం చూపించాయని మిషన్ చాణక్య సంస్థ చెబుతోంది.
అయితే, సిట్టింగ్ సీటైన హుజూర్‌నగర్‌ను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలంతా రంగంలోకి దిగి హుజూర్‌నగర్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక, తన స్వయంగా సతీమణిని బరిలోకి దింపిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... ఎలాగైనా గెలిచితీరాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఇటు, అధికార పార్టీ టీఆర్‌ఎస్ కూడా సర్వశక్తులూ ఒడ్డింది. అయితే, హోరాహోరీగా జరిగిన బైపోరులో... గులాబీ పార్టీదే ఆధిపత్యమని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. కానీ, తాను ఈ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మనని, కచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ఉత్తమ్ నమ్మకంగా చెబుతున్నారు. మరి హుజూర్ నగర్ ప్రజల తీర్పు ఎలా ఉండనుందో ఈనెల 24న తేలిపోనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/huzurnagar-by-elections-exit-poll-results-25-90392.html
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.