ప్రేమ, పెళ్లి.. పెళ్లి రోజున పెళ్ళాం బలి..
Publish Date:Jun 11, 2021
Advertisement
ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. ప్రేమించిన వాళ్ళకోసం ప్రాణం ఉన్నంత వరకు బతకడం..అవసరం అయితే అదే ప్రేమించిన వాళ్ళకోసం త్యాగం చెయ్యడం.. ఒకప్పటి మాట.. మరి ఇప్పుడు ఉన్నచాలా మంది ప్రేమికులలో కనిపించే విషయం..ప్రేమించామా..? వాడుకున్నామా..? వదిలేశామా..? అలాగే ఏదో పొరపాటున ప్రేమించాను.. ఇంత జరుగుతదనుకోలేదు. నాకు ఇష్టం లేకున్నా అందరూ కలిసి బలవంతంగా తనను ఇచ్చి పెళ్లి చేశారు.. అందుకే పెళ్లి అయ్యాక ఎలా విడిపోవాలని ఇంకొందరు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి మరో అబ్బాయి ప్రేమలో ఉండడం.. ఆ అబ్బాయి ఇంకో అమ్మాయితో సంబంధం ఉండడం.. నేటి ప్రేమికుల తీరు.. నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఉంతా కాలం ఈ మోసాలు జరుగుతూనే ఉంటాయి.. సరే విషయం లోకి వెళ్దాం.. అది కృష్ణా జిల్లా. విస్సన్నపేట మండలం. చండ్రుపట్ల తండా పంచాయతీ కొర్ర తండా గ్రామం.. ఈ గ్రామానికి చెందిన కొర్ర దుర్గారావు, ఇదే గ్రామానికి చెందిన లక్ష్మి (24) ని ప్రేమించాడు.. ప్రేమించిన అందరూ పెళ్లి చేసుకోరు.. అలా అని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారన్న నమ్మకం లేదు నేటి సమాజంలో.. అది అలా ఉంచితే వీళ్ళ ప్రేమను పెద్దలు అంగీకరించారు.. పెద్దల అనుమతితో గతేడాది పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగింది.. కొన్నీ కొన్నే పెళ్ళిలో గొడవలు జరుగుతాయి.. పెళ్ళిలో కొద్దిరోజులకే అల్లాంటి గొడవలు దంపతుల మధ్య జరగడం మొదలయ్యాయి..ఆ ప్రేమ జంట మధ్య అభిప్రాయభేదాలు రావటంతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం దుర్గారావు, లక్ష్మి పెళ్లిరోజు వేడుక జరుపుకున్నారు. అదేరోజు రాత్రి వారిద్దరి మధ్య మరోసారి వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన దుర్గారావు తీవ్రంగా కొట్టడంతో లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయింది. దీంతో కంగారుపడిన దుర్గారావు నేరుగా విస్సన్నపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. భార్య చనిపోయిన తర్వాత భర్త నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేశారు.
http://www.teluguone.com/news/content/husband-kills-his-wife-39-117387.html





