భార్యాభర్తలు మెసేజ్ లలో ఈ పనులు చేస్తే వారి రిలేషన్ నాశనమే..!

Publish Date:Jun 3, 2025

Advertisement

 

రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ప్రేమ జంట అయినా, భార్యాభర్తలైనా  ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో సమయం గడపాలని, మాట్లాడాలని కోరుకుంటారు. అయితే ఒకరికొకరు దూరంగా అంటే  వేర్వేరు ప్రదేశాలలో ఉన్న జంటలు ఒకరితో ఒకరు సమయం గడపడం కొంత కష్టమే. వారి మధ్య కమ్యూనికేషన్ మాత్రమే సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కమ్యూనికేట్ చేయడానికి భార్యాభర్తలు ఒకరికొకరు కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్‌లు చేయవచ్చు లేదా మెసేజ్ లు కూడా  పంపవచ్చు.

బిజీ లేదా ఇతర కారణాల వల్ల భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకోలేక పోయినట్లయితే, రోజంతా కొన్ని మెసేజ్‌ల ద్వారా భాగస్వామికి తాను దూరంగా లేడనే భావన కలిగించవచ్చు. అయితే, కొన్నిసార్లు ఈ మెసేజ్లు  భార్యాభర్తల మధ్య వివాదాలకు కూడా కారణం అవుతాయి.  భార్యాభర్తలు పొరపాటున కూడా కొన్ని మెసేజ్ లను తమ భాగస్వామికి  పంపకూడదు. అవేంటంటే..

రెస్పాండ్ కావడం..

భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు వారి మధ్య మెసేజ్ లలో జరిగే కమ్యూనికేషన్ ఎంత సరదాగా ఉంటుందో.. ఏదైనా తేడా జరిగితే చాలా ప్రభావవంతంగా కూడా ఉంటుంది.  ముఖ్యంగా భార్యలు ఏవైనా మెసేజ్ పెట్టినప్పుడు భర్తలు లేదా అబ్బాయిలు ఎక్కువగా రెస్పాండ్ కారు.కేవలం ఒక ముక్క లేదా ఒక మాటతో లేదా ఎమోజీలతో, స్చిక్కర్లతో  రిప్లే ఇస్తుంటారు.  ఇది కమ్యూనికేషన్ పట్ల అనాసక్తిని వ్యక్తం చేస్తుంది. అందుకే భార్యాభర్తలు ఒకరికొకరు మెసేజ్ చేసుకొనేటప్పుడు స్పష్టంగా ఉండాలి.

కోపం..

కోపం బంధాలను విచ్చిన్నం చేస్తుంది.  భార్యాభర్తలు మెసేజ్ చేసుకొనేటప్పుడు కోపం ప్రదర్శించడం కాదు.  భార్యలు ఎప్పుడూ భర్తల గురించే ఆలోచిస్తారు.  భార్యలు మెసేజ్ చేసినప్పుడు వారికి ఇచ్చే రిప్లే కోపంతో కూడుకుని ఉండకూడదు.  ఒకవేళ కోపంగా ఉన్నప్పుడు మెసేజ్ చేసినా, కాల్ చేసినా కొంచెం సేపటి తరువాత టచ్ లోకి వస్తాను అని చెప్పి కొద్దిసేపు మౌనంగా ఉండిపోవాలి. ఆ తరువాత సహజంగా మాట్లాడాలి.

పదే పదే..

భర్త లేదా భార్య ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.  భార్య భర్తకు అయినా,  భర్త భార్యకు అయినా పదే పదే నాన్ స్టాప్ గా మెసేజ్ లు చేయకూడదు.  ఒకసారి మెసేజ్ చేశాక అవతలి నుండి రెస్పాన్స్ లేకపోతే ఏదైనా పనిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి.   ముఖ్యంగా మహిళలు     ఈ విషయంలో కంగారు పడుతూ ఉంటారు.  భర్త తొందరగా స్పందించకపోతే ఏం జరిగిందో అని గాబరా పడతారు. కానీ  అవతల వారిని అర్థం చేసుకోవాలి. భర్తలు కూడా భార్య మెసేజ్ లు చూసిన తరువాత కాల్ చేసి మాట్లాడటం మంచిది.

గొడవలు వద్దు..

మెసేజ్ లో ఏ విషయాలు అయినా సాధారణ పలకరింపులు,  బాగోగులు అడిగి తెలుసుకోవడం, ఏవైనా కబుర్లు చెప్పుకోవడం మంచిది.  దేని గురించి అయినా ప్రశ్నించడం, సీరియస్ విషయాల గురించి అడగటం చేయకూడదు.  ఇలాంటివన్నీ నేరుగా మాట్లాడుకోవడం మంచిది.  లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు, అపార్థాలు పెరుగుతాయి. 

                                                            *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.