దుబాయ్‌లో భారత వ్యాపారుల మానవత్వం

Publish Date:Mar 10, 2026

Advertisement

 

ఇరాన్‌, ఇజ్రాయెల్‌-అమెరికా మధ్య ఘర్షణలతో పలువురు భారతీయులు పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయి అల్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దుబాయ్‌లో చిక్కుకొన్న వారికి సహాయం చేసేందుకు భారత సంతతి వ్యాపారవేత్త యోగేశ్‌ దోషి ముందుకువచ్చారు. 64 నివాసాలు ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో వసతి కల్పిస్తున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఘర్షణల కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో యూఏఈ  నుంచి స్వదేశానికి రావాల్సిన పలువురు భారతీయులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో తనవంతు సహాయం చేయాలని అల్‌ మిజన్ గ్రూప్ ఛైర్మన్ యోగేశ్ దోషి భావించారు. ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్‌ ఆఫ్ ఇండియా సమన్వయంతో తన అపార్ట్‌మెంట్‌లో తాత్కాలిక షెల్టర్‌ను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 125 మందికి ఉచితంగా వసతి కల్పించారు. వారికి ఆహారం వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. తాము ఇప్పటికే బుక్ చేసుకున్న హోటళ్లలో ఉండేందుకు గడువు ముగిసిందని, పొడిగింపు వీలు కాని క్లిష్ట సమయంలో తమకు ఈ సహాయం అందిందని పలువురు మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. 

యోగేశ్‌తో పాటు ఆ దేశంలో స్థిరపడిన పలువురు భారత సంతతి వ్యక్తులు ఈ ఉద్రిక్త సమయంలో తమ స్నేహహస్తం అందిస్తున్నారు. దుబాయ్‌ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్మన్‌లో వ్యాపారవేత్త ధీరజ్‌జైన్ ఇలాంటి వసతులే ఏర్పాటుచేశారు. వెంటనే స్వదేశానికి వెళ్లలేనివారి కోసం తన ఫామ్‌హౌస్‌లో తాత్కాలిక వసతి కల్పించారు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న వారికి ఉచితంగా ఈ సౌకర్యం అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని ఈ షెల్టర్ వద్దకు తీసుకురావడానికి రోల్స్ రాయిస్‌ సహా 11 కార్లను నడుపుతుండటం విశేషం.

By
en-us Political News

  
తెలంగాణరాష్ట్రంలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో మంచి అవకాశాన్ని కల్పించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతోమంది మహిళలు నాలుగు గోడల మధ్యే తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 2020 ఈశాన్య ఢిల్లీ మత ఘర్షణల కేసులో న్యాయస్థానం అత్యంత సంచలనాత్మక తుది తీర్పును వెలువరించింది.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
కోర్టు ఆదేశాలను ఉద్దేశపూ ర్వకంగా ఉల్లంఘించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశ ఇంధన భద్రత, వ్యవసాయ రంగం, క్రీడలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేస్తూ ప్రధాని
ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా డా. నరేంద్రకుమార్‌ నియామకం..!
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం
తెలంగాణలోని ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.
చనిపోయిందని వైద్యులు తేల్చేస్తే.. రోడ్డు గుంత ప్రాణం పోసింది..!
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసంరి లయన్స్.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఈ వేలంలో ఏలూరు జిల్లా పరిధిలోని బొగ్గు గనుల బ్లాకులను రిలయన్స్ దక్కించుకోవడంతో ఇంకే మాత్రం జాగు లేకుండా ఈ బిగ్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.