Publish Date:Jun 14, 2022
వ్యర్ధం ఏదయినా భారమే. ఇంట్లో సామానయినా, ఉపయోగించకుండా దాచిన మందులయినా!
కోవిడ్ భూతం పట్టుకుని పీడించినంత కాలం అతి జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వాలకు, మందుల తయారీ కంపె నీలకు ఇప్పుడు అతిగా మిగిలిపోయిన వాక్సిన్ మందులతో ఏమీ చేయాలో తోచడం లేదు. మొదటి వేవ్ సందర్భంలో అందరం కంగారు పడ్డాం. రెండవ వేవ్ సమయానికి వాక్సిన్ వేయించుకోవడం లో ప్రజలు ఎంతో ఆసక్తి చూపారు. మందుల కంపెనీలు అందుకు అవసరమయిన వాక్సిన్ డోసులు భారీ ఎత్తున ఉత్ప త్తి చేసి అందుబాటులో వుంచాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చకచకా వాక్సినేషన్ ఎంత అవరమన్నది ప్రచారం చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చాయి. ఆరోగ్యశాఖ, ఆస్పత్రులూ, డాక్టర్లూ ఎంతో అద్బుతంగా సేవలు అందించి అందరినీ ఆదుకున్నారు. ఇంతవరకూ బాగానే వుంది. ఆ తర్వాత అందరికీ కోవిడ్ భయం పోయి ప్రశాంతంగా బతకవచ్చు అనే ధైర్యం వచ్చేసింది. కానీ డాక్టర్లు మాత్రం ఇంకొన్నాళ్లు జాగ్రత్త గానే వుండాలన్న హెచ్చరికలను ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. మాస్క్ కూడా తీసి పడేసి జనాలు తిరిగేస్తున్నారు. నాలుగో వేవ్ మాటలు జనా లకు పట్టే స్థితి లేదు.
ఇప్పటికే చాలా కాలం వుద్యోగాలకు, పనులకు దూరమయి ఆర్ధికంగా కుదేలవుతున్న కుటుంబాలు, సంస్థలూ అన్నీ అందరూ కూడా మొన్నటి దాకా తీసుకున్న రెండు డోసుల బలం వుండనే వుంది ఇక ఏదీ తమకు ప్రాణహాని కలిగిం చదనే ధైర్యంతో బయటకి రావడం, పనులు చేసుకోవ డం జరుగుతోంది.
కానీ ముందస్తు జాగ్రత్తగానో, మూడో విడతకు అందుబాటులో వుండాలన్న జాగ్రత్తతోనో కోవీషీల్డ్, కోవాక్సి న్లు కంపెనీలు పెద్ద సంఖ్యలోనే ఉత్పత్తులు చేసి జాగ్రత్తపరిచాయి.
కానీ వాటి లైఫ్ టైమ్ ముగిసిపోయిం ది. వాటిని అర్జంట్‌గా ఉపయోగించే అవసరం ఇపుడు అంతగా లేదు. అయినా ప్రజలు ప్రికాషనరీ డోస్ వేసుకోవడదానికి ఇక ఆసక్తీ చూపడం లేదు. అయితే గతేడాది చివర్లో ఉత్పత్తి చేసి భద్రపరిచినవి భారం గానే మారాయి. ఎందుకంటే, వాటి ఎక్స్‌పైరీ డేట్ అయిపో యింది. దాన్ని మరికొంతకాలం పొడగించే వీలుందే మో చూడమని ప్రభుత్వాలు కోరుతున్నాయి. అది ఎంతవరకూ సాధ్యమన్నది ఆయా కంపెనీ లు, సంస్థలు ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. ఇలా వ్యర్థంగా పారబోసే బదులు అందరికీ బూస్టర్ డోస్ ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయవచ్చు కదా అని పరిశీలకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బూస్టర్ డోస్ ను సీనియర్ సిటిజన్లకు మాత్రమే ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. మిగిలిన వారంతా ప్రైవేటు ఆసుపత్రులలో డబ్బులు ఇచ్చి కొనుక్కోవలసిన పరిస్థితి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/huge-vaccine-waste--39-137618.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.