Publish Date:Feb 17, 2026
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో గతంలో ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది.
2016 జనవరి 12న అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతో ఎ.కొండల్‌రెడ్డి, ఇ.లక్ష్మయ్య అనే ఇద్దరు హైదరాబాద్ గోపనపల్లి సొసైటీ భూముల్లో ఒక గదిని జేసీబీతో ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చాయి. అందుకు అడ్డుచెప్పిన తనను కులం పేరుతో దూషించారని ఎన్.పెద్దిరాజు అనే వ్యక్తి గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు.
ఈ కేసు ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేయడంతో, పెద్దిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ వీఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం సోమవారం (ఫిబ్రవరి 16) ఈ కేసును రాజకీయ ప్రేరేపితం అంశంగా పేర్కొంటూ డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం.. రాజకీయ కక్షల కోసం న్యాయస్థానాలకు రావొద్దని పిటిషనర్ కు చెప్పింది. ఈకేసులో ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/huge-relief-to-revanth-in-supreme-court-36-214222.html
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు.