కౌగిలింతలకు ఇన్ని అర్థాలున్నాయా?

Publish Date:Jun 29, 2024

Advertisement

కౌగిలి ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక బంధాన్ని తద్వారా మానసిక బంధాన్ని కూడా బలపరుస్తుంది. ముఖ్యంగా జీవిత  భాగస్వాములు ఒకరినొకరు కౌగిలించుకోవడం వల్ల వారి మనసులో ఉన్న విషయాలను బయటకు తెలియజేస్తుంటారు. ఒక గట్టి కౌగిలి భాగస్వాముల మధ్య ఉండే అపార్దాలను, కోపతాపాలను, పొరపొచ్చాలను మాయం చేస్తుంది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా భాగస్వాములు  కౌగిలించుకోవడం మంచిదేనని రిలేషన్ షిప్ నిపుణులు చెబుతున్నారు. అయితే కౌగిలి లోనూ రకాలున్నాయని. వాటికి బోలెడు అర్థాలున్నాయని తెలిసింది. ఇంతకీ ఎలా కౌగిలించుకుంటే ఏమర్థమో తెలుసుకుంటే..

ఎదురుగా భుజం మీద వాలి కౌగిలించుకుంటే..

ఒకరికొకరు ఎదురుగా కౌగిలించుకున్నప్పుడు జీవిత భాగస్వామి భుజం మీద తలను పెట్టుకోవడానికి ఇష్టపడితే వారు ప్రేమను ఆశిస్తున్నట్టు.  ఇద్దరి మధ్య అవగాహన, అర్థం చేసుకునే గుణం మెండుగా ఉన్నట్టు. ఇది ఒకానొక సురక్షిత భావనను అందిస్తుంది.

వెనుక నుండి కౌగిలించుకుంటే..

వెనుక నుండి కౌగిలించుకోవడం వల్ల భార్య లేదా భర్త చాలా  మిస్సవుతున్నారని అర్థమట. అదే విషయాన్ని చెప్పడానికి వెనుక నుండి కౌగిలించుకుంటారట.  ఒకవేళ ఎప్పుడూ ఇలాగే కౌగిలించుకుంటూ ఉంటే ఎప్పుడూ ప్రేమను కోరుకుంటున్నారని అర్థమట.

భుజాలను పెనవేసుకుని కౌగిలించుకుంటే..

భుజాలను పెనవేసుకుని కౌగిలించుకుంటే ఆ కౌగిలిలో ప్రేమ, నమ్మకం పాళ్లు ఎక్కువ ఉన్నాయని అర్థం. అలాగే ఆ భాగస్వాముల మధ్య శృంగార జీవితం కూడా బాగా ఉన్నట్టు. ఈ కౌగిలి ద్వారా ఇద్దరి మధ్య రొమాంటిక్  ఫీలింగ్ మరింత పెరుగుతుంది.

గట్టి కౌగిలి..

జీవిత భాగస్వాములు ఒకరినొకరు దగ్గరగా, గట్టిగా రెండు చేతులతో కౌగిలించుకుంటే వారిద్దరూ ఒకరికొకరు దగ్గరగా ఉండాలని, ఎప్పటికీ విడిపోకూడదని కోరుకుంటున్నారని అర్థం. ఒకరినొకరు తీవ్రంగా  ఇష్టపడటం ఈ కౌగిలి  తెలుపుతుంది.

ఒక చేత్తో కౌగిలించుకుంటే..

ఒక చేత్తో కౌగిలించుకుంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి స్నేహ భావాన్ని సూచిస్తే.. రెండోది బహిరంగంగా కౌగిలించుకోవడం ఇష్టం లేదని తెలపడం. ఇది నిబద్దతకు, సామాజిక అవగాహనకు సంబంధించినది.

                                           *నిశ్శబ్ద.

 

By
en-us Political News

  
 ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం.
నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి....
వివాహం ఇద్దరు వ్యక్తుల జీవితాలను మార్చే సంఘటన.
ఇల్లు అయినా,  ఆఫీసు అయినా.. వేరే ఇతర ప్రదేశమైనా.. అందరూ మనల్ని ఇష్టపడాలని,  అందరూ మనకు ఆకర్షితమవ్వాలని,  మనల్ని గౌరవించాలని అనుకోవడంలో తప్పు లేదు.
మూడు రోజుల కిందట భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది.
ఒక వ్యక్తి చాణక్య నీతి సూత్రాలను లోతుగా అధ్యయనం చేస్తే అతను జీవితంలో ప్రతి అడుగులోనూ విజయం సాధిస్తాడు.
కాశ్మీర్ అనేది కేవలం ఒక భూభాగం కాదు. చరిత్ర, జానపద కథలు,  సంస్కృతి  పొరలతో చుట్టబడిన పేరు.  
ఈ జనరేషన్ ను ఆల్ఫా యుగం అనవచ్చు. ఇది AI, స్మార్ట్ పరికరాలు, ఆన్‌లైన్ లెర్నింగ్,  సోషల్ మీడియా మధ్య పెరుగుతోంది.
నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం.
వివాహం అనేది భారతీయ సమాజంలో జీవితాంతం నిలిచే బంధంగా పరిగణించబడే సంబంధం.
మండుతున్న ఎండల కారణంగా ప్రజల పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ సీజన్‌లో ప్రతి రెండవ వ్యక్తి చెమటతో ఇబ్బంది పడుతుండటం గమనించవచ్చు. దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. చెమట వల్ల శరీరం దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది....
పిల్లలకు ఒక వయసు రాగానే పుస్తకాలతో సావాసం మొదలవుతుంది.
ప్రాచీన భారతీయ పండితుడు చాణక్యుడు రాసిన చాణక్య నీతి జీవితంలోని ప్రతి అంశాన్ని సరైన దృక్కోణం నుండి చూడటానికి మనల్ని ప్రేరేపిస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.