టెట్ స‌ర్టిఫికెట్ ఇక లైఫ్ టైమ్.. టీచర్ అభ్యర్థులకు కేంద్రం వరం

Publish Date:Jun 3, 2021

Advertisement

విద్యాశాఖకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు చేసిన మోడీ సర్కార్ .. తాజాగా టెట్ ( Teacher Eligibility Test) స‌ర్టిఫికెట్ గ‌డువును ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేర‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నిర్ణయం ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునేవారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్నారు.ఏడేళ్ల కాల‌ప‌రిమితి ముగిసిన వారికి మ‌ళ్లీ స‌ర్టిఫికెటు ఇవ్వాల‌ని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేంద్ర విద్యాశాఖ పలు సూచనలు జారీ చేసింది.  కేంద్ర సర్కార్ నిర్ణయంతో 2011 నుంచి టెట్ స‌ర్టిఫికెట్ పొందిన అభ్య‌ర్థుల‌కు జీవిత‌కాలం అర్హ‌త వ‌ర్తించ‌నున్నట్లు అధికారులు తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) క్వాలిఫై కావడం తప్పనిసరి. దీంతోపాటు వ్యాలిడిటీని కూడా చూస్తారు. టెట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, కేంద్రం (CTET) కూడా వేర్వేరుగా నిర్వహిస్తాయి. ఈ టెట్ సర్టిఫికెట్ వేలిడిటీ ఏడేళ్లు అని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్-NCTE 2011లో మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రస్తుతం దాని మార్కుల విలువ ఏడేళ్ల వరకు ఉంది. ఆలోపు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుకు ఎంపిక కాకుంటే ఆ పరీక్షను మళ్లీ రాయాల్సిందే. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) తాజాగా టెట్‌ స్కోర్‌ కాలపరిమితిని ఏడేళ్లకు బదులు జీవితకాలం ఉండేలా నిర్ణయించింది. ఇక నుంచి టెట్‌ రాసి, ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది. ఎన్‌సీటీఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షల మందికి ఊరట కలగనుంది. ఇప్పటికే ఉత్తీర్ణులైన వారికి న్యాయనిపుణుల సలహా తీసుకొని దాన్ని పాటిస్తామని ఎన్‌సీటీఈ 50వ సర్వసభ్య సమావేశంలో అధికారులు నిర్ణయించారు.

కేంద్ర సర్కార్ తాజా నిర్ణయం తెలంగాణ ఉపాధ్యాయ అభ్యర్థులకు వరంగా మారనుంది. రాష్ట్రంలో చాలా కాలంగా టెట్ నిర్వహించడం లేదు. దీంతో లక్షలాది మంది అభ్యర్థుల టెట్ కాల పరిమితి ముగిసింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేయాలని భావించింది. అయితే టెట్ నిర్వహించకపోవడం అడ్డంకిగా మారింది. కోవిడ్ పరిస్థితుల్లో ఇప్పట్లో టెట్ నిర్వహించడం కూడా అసాధ్యమే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టులను ఎలా భర్తీ చేయాలన్నది గందరగోళంగా మారింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో ఇప్పుడా సమస్య తీరినట్లే. 

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.