చలికాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!

Publish Date:Nov 20, 2023

Advertisement


 

శీతాకాలంలో జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. అయితే ఈ కాలంలో చాలా మంది బరువు కూడా పెరుగుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకు ఈ కాలంలో బరువు పెరగడానికి అసలు కారణాలు ఏంటి? అది తెలుసుకుంటే మన శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చు.

చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. దీంతో ఫిట్నెస్ రొటిన్ అదుపు తప్పి...శరీరంలో క్యాలరీలు కొవ్వుగా మారుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. అయితే దీన్ని అధిగమించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలో మీ భాగస్వామి లేదాస స్నేహితుడిని ఫిట్నెస్ పార్టనర్ గా సెలక్ట్ చేసుకుని ఒకరికొకరు ప్రోత్సహించకుంటూ వ్యాయామం చేయండి. ఇదొక్కటే కాదు ఈ కాలంలో బరువు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం.

ఎండ శరీరానికి తగలకపోయినా:

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం ఎండలో నిల్చుంటాం. ఈ క్రమంలో ఎండలో వ్యాయామాలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఈ కాలంలో కొన్ని రోజులు పొగమంచు కారణంగా ఎండ ఉండదు. ఇలా  చలికాలంలో శరీరానికి ఎండ తగలకపోవడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ సమస్య తలెత్తే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక రకమైన డిప్రెషన్ వంటిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ఆహారపు అలవాట్లు, మోతాదుకు మించి ఆహారం తినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అలవాట్లు అంతిమంగా బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి కాబట్టి ఉదయం ఎండ లేకపోతే మధ్యాహ్నం పూట కాసేపు వీలు కుదుర్చుకుని ఎండలో ఉండటం మంచిది. అయితే ఈ క్రమంలో సూర్యకిరణాల కారణంగా చర్మ సమస్యలు తలెత్తకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.

హర్మోన్ల అసమతుల్యత:

హర్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా బరువు పెరుగుతారని మనకు తెలిసిందే. అయితే వాతావరణంలో మార్పులు వచ్చిన కొద్దీ హర్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగే ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఆహారపు కోరికలను పెంచుతుంది. దీంతో బరువు పెరుగుతాం.

అర్థరాత్రి ఆకలేస్తుంది?

శీతాకాలంలో పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈక్రమంలో డిన్నర్ తొందరగా చేయడం, రాత్రి ఎక్కువ సేపు మెలకువ ఉండటం, రాత్రుళ్లు తేలికపాటి ఆహారం తీసుకోవడం..ఇలా కారణాలతో అర్థరాత్రి ఆకలేస్తుంది. అలాంటప్పుడు చాలామంది బిస్కెట్లు, చిప్స్, పాప్ కార్న్, కుకీస్, చాక్లెట్స్ తింటుంటారు. ఈ అలవాటును కొనసాగి్స్తే బరువు పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. వీటికి బదులుగా పండు, పండ్ల రసాలు, నట్స్ , డ్రైఫ్రూట్స్ తినడం మంచిదని చెబుతున్నారు.

By
en-us Political News

  
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.