ఆర్గ్యూ జరిగేటప్పుడు ఏడవకూడదు అనుకుని కూడా ఏడ్చేస్తుంటారా? ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు..!
Publish Date:Nov 15, 2023
Advertisement
ఏడవడం ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చేసే పనే.. అయితే ఎప్పుడు ఏడుస్తున్నాం, ఎందుకు ఏడుస్తున్నాం అనేది మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు ఇతరులతో ఏదైనా వాదిస్తున్నప్పుడో.. గొడవ పడుతున్నప్పుడో అప్రయత్నంగా ఏడ్చేస్తుంటాం. మనిషిలో ఎమోషన్ స్థాయి పెరిగినప్పుడు ఎంత కంట్రోల్ చేసుకుందాం అన్నా కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. అదే ఏడుపుగా బయటకు వస్తూంటుంది. అయితే ఇలా ఏడ్చిన తరువాత.. అయ్యో ఎందుకు ఏడ్చాము అని ఎవరిని వారు అనుకుంటూంటారు. కొన్ని సార్లు తమని తాము నిందించుకునే వారు కూడా ఉంటారు. అయితే కింది చిట్కాలతో ఎలాంటి సిట్యుయేషన్ లో అయినా ఏడుపును నియంత్రించుకోవచ్చు. ఎవరితో అయినా వాదిస్తున్నప్పుడు, గొడవ పడుతున్నప్పుడు ఏడుపు వస్తుంటే అసలు ఏడుపు ఎందుకు వస్తోంది అని ఆలోచించాలి. దాని కారణం అర్థం అయ్యాక అసలు ఏడవాలని అనుకున్నా కూడ ఏడుపు రాదు. అంతేకాదు.. అలా ఏడవడానికి బదులుగా ఇతరులతో లాజిక్ గా మాట్లాడతారు. సైలెంట్.. గొడవ లేదా వాదన జరుగుతున్నప్పుడు ఏడుపు వచ్చినా దాన్ని అణుచుకోవాలన్నా, ఎదుటివారితో లాజిక్ గా మాట్లాడాలన్నా సింపుల్ గా కాసేపు సైలెంట్ గా ఉండటం మంచిది. దీని వల్ల విషయాన్ని బాగా అర్థం చేసుకుని లాజిక్ గా వాదించి మీరే కరెక్ట్ అనిపించుకోవచ్చు.
కారణం..
డైవర్ట్ కావాలి..
ఆర్గ్యూ చేసుకున్నప్పుడు ఏడుపు వస్తుంటే దాన్ని బయటపడనివ్వకుండా డైవర్ట్ కావాలి. ఇందుకోసం పిడికిలి బిగించడం, లోతుగా శ్వాస తీసుకోవడం, గట్టిగా కళ్లు మూసుకోవడం వంటి చర్యల ద్వారా కోపాన్ని డైవర్ట్ చేయాలి.
*నిశ్శబ్ద.
http://www.teluguone.com/news/content/how-to-stop-yourself-from-crying-35-176003.html